Wednesday 12 January 2011

తెలంగాన కాని తెలుగోల్లు మాత్రం అస్సలు సదువొద్దు

ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాన ప్రజల పైసలతోని గట్టింది. అండ్ల బెంగాలోడు సదువొచ్చు. బీహారోడు సదువొచ్చు. తమిలోడు సదువొచ్చు - గట్ల వేరే ఏ రాష్ట్రం కెల్లి వచ్చినోల్లైన సదువొచ్చు. తెలంగాన కాని తెలుగోల్లు మాత్రం అస్సలు సదువొద్దు. ఆ... ఏందీ ... ఏమంటున్రూ ... మల్ల ఐద్రబాదుల పుట్టి పెరిగినోల్ల సంగతేందంటరా ... గదే ... ఆడికే వస్తున్న... ఐద్రబాదుల పుట్టినా - వాల్ల అమ్మ నాయ్నలు ఈడోల్లె గావాలె. తాత ముత్తాతలు ఈడోల్లే గావాలె. తెలంగానల లేని జిల్లలకెల్లి ఈడకి బతకనికె వచ్చినోల్లయితె - గసుంటొల్లని అస్సలు ఈడ సదువనీయం. గీడ సదువాలంటే తాత ముత్తాలు - తర తరాలు - తెలంగానల స్వంత ఊరు అయినోల్లయితెనే రానిస్తం. లేకుంటె తరిమి తరిమి కొడుతం.

మల్లేంది జెప్తున్నవు... గా పోటీ పరిచ్చలల్ల మొదటి రాంకు వచ్చినాది ... అట్లయితే గిది బాజాప్తుగ సీమాంద్రోల్ల కుట్ర వల్లనే వచ్చినాది. 54 ఏళ్ళుగ మా నీల్లు దోచుకున్రు. మా సదువులు దోచుకున్రు. మా కొలువులు దోచుకున్రు. గందుకె మేమిప్పుడు మా యూనివర్సిటీల వాల్లని రానీయం. వస్తె వాల్ల సర్టిఫికేట్లు చింపుతం. వాల్ల మొకాన ఆసిడ్ పోస్తం. మా సీట్లు మావోల్లకే ఈయాలె. తాత ముత్తాతలు తెలంగానోల్లు గాకుంటె ఈడ పుట్టిన గా పిల్లలు తెలంగానోల్లు కారు.

అగ్గో మల్ల గట్ల సూడబట్టినవు - మమ్ముల దోసుకోలేదని శ్రీ క్రిష్ణ కమిటీ చెప్పినాది ... అరె వాడెవడు భయి చెప్పనికి? మాకు అన్యాయం జరిగిందని మేము చెబితే యెసుంటొడైన ఒప్పుకోవాలె. లేకుంటె ఊరుకోము. మా రాష్ట్రం మాకిచ్చేయున్రి. అంతనే మల్ల. రెండో మాట మేము ఇనం. ఇయ్యాల 1956 ముందు ఉన్న తెలంగాననే ఐద్రబాదు తో కల్పి మాకు గావాలె. ఏందిరో గట్ల మొకం చిట్లిస్తున్నవు - గప్పుడు కర్నాటకల మహారాష్ట్రల షామిలైన జిల్లాలు గూడ ఉన్నయంటవా ... గా ముచ్చట మాకు దెల్వదు. మేము వాల్లని తిట్టము. మా పోరాటం నా పక్క తెలుగోనితోనె. (మరి వీడైతెనె గద - నన్ను భరిస్తడు. పక్క రాష్ట్రాలలోల్లయితె లాగి నాలుగు తంతరు మల్ల).

మా తెలంగాన మాకీయుర్రి. మా ప్రాంతం మేము పాలించుకుంటం. మా యూనివర్సిటీలల్ల సీమాంద్రోల్లు సదువొద్దని జీవో పాసు చేస్తం. మా ఊర్లల్ల ఉన్న తెలంగాన కానోల్లని తరిమి తరిమి కొడ్తం. మా జాగలల్ల ఉన్న ఆస్తులు వదలి పొమ్మంటం. మా మాట ఇనకుంటె నిలువునా కాలవెడ్తం. మల్లీ గట్ల చూస్తవేందిరా ... నీ ... ఇగ నే చెప్ప. మా తీరే ఇంత మరి. మేమిట్లనే ఉంటం. అంతేగానీ మేము సదువం. కస్టపడం - అరె ఎందుకు కస్టపడాలె ? మా కే సీ ఆర్ అన్న మాకు కొలువులు ఇప్పిస్తడు. మాకు బుక్క వెట్టిస్తడు. నీల్లు తాపిస్తడు. మా పోరగాల్లను ఇంకా భడ్కాయిస్తడు. అంత గనం లీడరు మాకుండగ... మీ మాట మేమెందుకు ఇనాలె? జై తెలంగాన ... జై జై తెలంగాన.

నిన్న మా సహోద్యోగి తన భార్య పీ.హెచ్. డీ మౌఖిక పరీక్ష కోసం వెళితే తనకి చాలా భయానక అనుభవం ఎదురైంది. ఎలాగో తప్పించుకుని బయటపడింది. లేకుంటే చదువు సంగతి దేవుడెరుగు - వారి చేతిలోని ఆసిడ్ సీసాకి బలి అయి ఉండేది. విద్యార్ధుల ముసుగులో ఇలాటి అరాచకాలకు ఆకృత్యాలకు పాల్పడే వారిని ఏ చెప్పుతో కొట్టాలి? కనీస విచక్షణ లేని వీరు వేర్పాటు వాదం పేరు చెప్పుకొని గూండాగిరీ చేస్తున్నారు - ఛీ --!

8 comments:

Sravya V said...

So Sad !

జయంత్ కుమార్ said...

అలా అయితే మీ కెసిఆర్ ని. ఏమి చెయ్యమంటావ్ బిడ్డ వాడు కూడా ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చినట్లున్నాడే......... అందరు కొట్టుకు చావండి......

http://telugutelevisionmedia.blogspot.com/

విరజాజి said...

శ్రావ్య గారూ, నిజంగానే చాలా బాధేసిందండీ వింటుంటే! పీ హెచ్ డీ ఇంటర్వ్యూ కి వెళితే సీట్ సంగతి అలా ఉంచి ఎవరైనా ఇలా ఆసిడ్ పోస్తామంటే భయమేయదుటండీ??

అయ్యా జయంత్ గారూ ... మీరు ఆఖరి పేరా చదివినట్లు లేదు. పోనీలెండి. కే సీ ఆర్ ని కొట్టే చాన్సు బ్లాగులోనైనా ఇచ్చారు సంతోషం.

SHANKAR.S said...

ఆఖరు పేరా చదివి బాధేసింది.
ఒకింత భయమేసింది.
అంత మూర్ఖత్వాన్ని తమ రాజకీయ స్వార్ధం కోసం పెంచి పోషించిన, పోషిస్తున్న నాయకులని చూసి అసహ్యమేసింది.
నాయకుల మాటల్లో పడి తామేం కోల్పోతున్నామో తెలియని ఆ విద్యార్ధులని చూసి జాలేసింది.

Unknown said...

ఎలా తప్పించుకుంది తల్లీ? అది కూడా చెప్పలేక పొయావా? మనసునిండా తెలంగాణా ప్రజలపై ద్వేషాన్ని నింపుకుని బాగానే రాసినవ్. ఇలాంటి అబద్ధాలు మీకే చెల్లు. సెలవ్.

విరజాజి said...

శ్రీకాంతాచారి గారూ,

అబధ్ధాలు రాయాల్సిన అవసరం నాకేమీ లేదండీ! ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఏమి జరుగుతోందో అందరికీ తెలుసు. పైగా మీరు అన్న మాట ఎంత దారుణంగా ఉన్నదో ఒక సారి అలోచించండి - "మనసునిండా తెలంగాణా ప్రజలపై ద్వేషాన్ని నింపుకుని బాగానే రాసినవ్. ఇలాంటి అబద్ధాలు మీకే చెల్లు. " ఎంత మాట అనేసారు? మూర్ఖపు వేర్పాటు వాదుల గురించి నేను రాసిన దాన్ని మొత్తం తెలాంగాణా ప్రజలకి ఆపాదిస్తారా? తెలంగాణా నా జన్మభూమి. తెలంగాణా ప్రజలపై ద్వేషం ఉండాల్సిన అవసరం నకెందుకు ఉంటుందండీ? (అయినా ఆంద్రోల్లని ద్వేషించాలి అని వేర్పాటు వాదులు డిసైడ్ జేశిన్రు గద - అందుకొరకె మొత్తం తెలంగాన ప్రజలని రెచ్చగొట్టనికె గిట్ల లేని పోని ద్వేషాన్ని మాకు అంటగడుతున్రు.) వేర్పాటు వాద విపరీతపు పోకడల గురించి నేను రాస్తే - మీకు అది అబధ్ధం లాగా కనిపిస్తోందా? ఎందుకండీ ప్రతీదాన్నీ వక్రీకరిస్తారు ?

ఎలా తప్పించుకుందో చెప్పమంటున్నారు - నే జెప్ప. మీ అసుంటోల్లకి అసలు జెప్ప. మీ మీద ఆసిడ్ పోస్తమని ఎవ్వలైన వస్తె మీకు ఎరికైతది. తప్పించుకున్నోల్ల సంగతి జెబ్తె మల్ల ఇంకొక నాల్గు కొత్త ఆసిడ్ బాటల్లు పట్టుకపోనికెనా అడుగుతున్రు?

తెలివి లేని కొందరు జేసే పనులకి చివరకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులంటేనే ఛీ అనిపించుకునే స్థాయికి ప్రస్తుత పరిస్థితి వచ్చింది. అదింకా చేయి దాటక ముందే పిల్లలు మేల్కొనాలి. ఈ స్వార్ధ నాయకులు వారి పబ్బం గడుపుకోడానికి విద్యార్ధుల మనసుల్లో ఎంత విషం పోసారో తలచుకుంటేనే బాధగా ఉంది. దానికి తోడు మీ వంటి వారు కూడా అలాటి చర్యలను ఖండించాల్సింది పోయి, ఇలా జరుగుతోందని చెప్తే - అబధ్ధమంటారా?

విరజాజి said...

శంకర్ గారూ,

నిజమండీ! విద్యార్ధులని చూసి జాలి పడాల్సిందే - కానీ చదువుకున్న మూర్ఖులని ఏమి చేయగలం? పైన శ్రీకాంతాచారి గారి కామెంట్ చూసారుగా? మనం ఏమి చెప్పినా తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే వారికి మనం చెప్పేది తలకెక్కుతుందా?

Sravya V said...

శ్రీకాంత్ గారు ఇలాంటి విషయాలు రాసే వాళ్ళు చెప్పే వన్నీ అబద్దలేనన్న మాట . ఒక్కసారి మీ వాఖ్య చూడండి ఎంత అసంబద్దం గా ఉందో . ఇలాంటి సంఘటనలని వ్యతిరేకించే వారినందరినీ తెలంగాణా వారు కాదు అని అలాగే వాళ్ళేదో ద్వేషం తో ఉన్నారు అనే మీ అభిప్రాయం అంత సమంజసం గా లేదు .
@జయంత్ గారు సడన్ గా కెసిఆర్ ఆంధ్రోల్ల వాడయ్యడా ? భలే జోక్ వేసారు సార్ !