Wednesday 20 January 2010

అమరవీరులంటే ఎవరు?

బ్రతకడం చాత కాక, బ్రతుకు విలువ తెలీక, అవగాహనా రాహిత్యంతో ప్రాణాలు తీసుకునేవారు అమరవీరులు అవుతారా? తెలంగాణా సాయుధ పోరాటంలో నేలకొరిగిన ఎందరో సామాన్య ప్రజలు అమరవీరులు - వారు కనీసం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కున్నారు. అన్యాయానికి ఎదురు నిలిచారు. సాహసంతో ముందుకు ఉరికారు. వారితో ఈ ఆత్మహత్యా వీరులని పోల్చి, ఆ నిజమైన అమరవీరులని అవమానిచడానికి ఈ జే ఏ సీ నాయకులకి, తెలంగాణా వేర్పాటువాదులకి మనసు ఎలా ఒప్పింది? మన గడ్డపై ఎందరో యోధులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. కానీ ఒక్కరు కూడా పిఱికి తనంతో ఆత్మహత్య చేసుకోలేదు. వారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలుపుకొని, వారు నిజంగా అమరులైనారు ! నిరాశతో, నిస్పృహతో తమ తనువు చాలించేవారు వీరులెలా అవుతారు? జీవితం ఎంతో విలువైనది. మనకు కావలసింది దక్కకుంటే ఎవ్వరికైనా ఆశాభంగం కలుగుతుంది. అయితే, ఆశలు నెరవేరే మార్గం కోసం ప్రయత్నించాలిగానీ, జీవితాన్ని అంతం చేసుకుంటే ఆశ ఫలిస్తుందా? మన పై ఎన్నో ఆశలు పెట్టుకుని, మనలని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, మనకు చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబ సభ్యులు మన మరణంతో ఎంత కృంగిపోతారో ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాటి పిచ్చి పనులు ఎవ్వరూ చేయరు. కానీ ఇలా తమని తాము చంపుకొన్న వారికి అమరత్వాన్ని ఆపాదించి అమర వీరులుగా కీర్తించి, హీరోలుగా చిత్రీకరిస్తే, ఇంకెందరు ఆ భావోద్వేగంలో కొట్టుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటారో అన్న కనీస విచక్షణ ఈ నాయకులకి లేదా? తెలంగాణా రాష్ట్రం వస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీడియా అంతా చనిపోయిన ఒక విద్యార్ధిని గురించి అంతగా ఘోషిస్తూ ఉంటే - ఇంకెందరు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమరత్వాన్ని పొందుదామని స్ఫూర్తి పొందుతారో వీరికి అర్ధం కాదా? ఇలాటి చావులకి ప్రభుత్వాలు కాదు, వారి మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తున్న వేర్పాటు వాదులు, విభజన వీరులు, మీడియా బాధ్యత వహించాలి. మనుషులని చంపే ఉద్యమాలు కాదు - చేతనైతే, మానవీయ విలువలని కాపాడే ఉద్యమాలు మనకి ఇప్పుడు అవసరం. చిన్నారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా - చెప్పుడు మాటలు విని, బంగారు భవిష్యత్తుని మీరు మీ చేతులతో నాశనం చేసుకోకండి. మీ చదువులను పాడు చేసుకోకండి. విద్యార్ధి జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు, మీజ్ఞానాన్ని పెంచుకుని, దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీ చదువులు పూర్తి చేయడానికి కష్టపడండి, తప్పక తరువాత ఆ కష్టం విలువ మీకు తెలిసి వస్తుంది. చేతనైతే ఒకరినుంచీ మంచి నేర్చుకోండి - అంతే గానీ విద్వేషాలు మనసుల్లో నింపుకోకండి. మన తల్లితండ్రుల కలలు మన ద్వారానే సాకారం అవుతాయని గ్రహించండి. జీవితాన్ని జీవించండి. ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న ఈ నాయక గణంలో ఒక్కరి పిల్లలు కూడా ప్రాణాలు తీసుకోవడంలేదు - అది గమనించండి. ఆత్మహత్య ఏనాటికీ అమరత్వం కాదని గుర్తెరగండి. రాష్ట్రం వస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీడియా అంతా చనిపోయిన ఒక విద్యార్ధిని గురించి అంతగా ఘోషిస్తూ ఉంటే - ఇంకెందరు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమరత్వాన్ని పొందుదామని స్ఫూర్తి పొందుతారో వీరికి అర్ధం కాదా? ఇలాటి చావులకి ప్రభుత్వాలు కాదు, వారి మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తున్న వేర్పాటు వాదులు, విభజన వీరులు, మీడియా బాధ్యత వహించాలి. మనుషులని చంపే ఉద్యమాలు కాదు - చేతనైతే, మానవీయ విలువలని కాపాడే ఉద్యమాలు మనకి ఇప్పుడు అవసరం. చిన్నారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా - చెప్పుడు మాటలు విని, బంగారు భవిష్యత్తుని మీరు మీ చేతులతో నాశనం చేసుకోకండి. మీ చదువులను పాడు చేసుకోకండి. విద్యార్ధి జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు, మీజ్ఞానాన్ని పెంచుకుని, దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీ చదువులు పూర్తి చేయడానికి కష్టపడండి, తప్పక తరువాత ఆ కష్టం విలువ మీకు తెలిసి వస్తుంది. చేతనైతే ఒకరినుంచీ మంచి నేర్చుకోండి - అంతే గానీ విద్వేషాలు మనసుల్లో నింపుకోకండి. మన తల్లితండ్రుల కలలు మన ద్వారానే సాకారం అవుతాయని గ్రహించండి. జీవితాన్ని జీవించండి. ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న ఈ నాయక గణంలో ఒక్కరి పిల్లలు కూడా ప్రాణాలు తీసుకోవడంలేదు - అది గమనించండి. ఆత్మహత్య ఏనాటికీ అమరత్వం కాదని గుర్తెరగండి.

3 comments:

కెక్యూబ్ వర్మ said...

మంచి వివరణ.

శరత్ కాలమ్ said...

చక్కగా చెప్పారు. మరోసారి మీడియా పైత్యం వల్ల నష్టాలు అర్ధం అయ్యాయి.

విరజాజి said...

శరత్ గారూ, వర్మ గారూ, నెనరులు

ఇలాటి మరణాలు చూస్తే చాలా బాధ వేస్తుంది. టీ వీ చానళ్ళు మాత్రమే కాదు - పత్రికలేం తక్కువ తిన్నాయా - "నేల రాలిన ఉద్యమ తార" అని హెడ్డింగులు పెట్టి జనాల ఉన్మాదాన్ని ఇంకా పెంచుతున్నారు.

ఇందాకే తాడేపల్లి గారి బ్లాగులో ఒక అజ్ఞాత కామెంటులు చూసా - చనిపోవడానికి అతడి కుటుంబానికి చాలా డబ్బు ముట్టిందని, ఆత్మాహుతి చేసుకునే ముందు ఏదో మందు తాగితే నొప్పి తెలీదని, ఆ విషయం నిగ్గు తేల్చడానికే పోలీసులు అతడి శవాన్ని హైజాక్ చేసి పోస్టుమార్టం చేసి బంధువులకి అప్పజెప్పారని అతడు రాశాదు. ఏది ఏమైనా ఈ శవ రాజకీయలతో తెలంగాణా సాధించాలనుకునే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి.

ఇది చదవండి. మీకే తెలుస్తుంది.

http://www.tadepally.com/2010/01/blog-post_20.html#comments