Tuesday 5 January 2010

హైదరాబాదు 1956 లోనే చాలా అభివృధ్ధి చెంది ఉంది

"హైదరాబాదు 1956 లోనే చాలా అభివృధ్ధి చెంది ఉంది - కొత్తగా అభివృధ్ధి చెందినది ఏమీ లేదు" - (హైదరాబాదు కోసం తెలంగాణా వారు చెప్పే పేద్ద అబద్ధం)

అలా అయితే - 1956 తరువాత హైదరాబాదులో పెట్టిన పరిశ్రమలను, విశ్వ విద్యాలయాలను, పాఠశాలలను, కళాశాలలను, ఐ.ఐ.టీ, ఐ.యెస్.బి లాటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను, అనేక కార్యాలయాల ప్రధాన శాఖలను, అలాగే ప్రతీఎ ఒక్క పెద్ద రోడ్డునూ, ఫ్లై ఒవర్ బ్రిడ్జీలనూ - అన్నీ తెచ్చినది సీమాంధ్ర ముఖ్య మంత్రులే కనుక, సీమాంధ్ర కి ఇచ్చేస్తారా? మా తెలుగు లిపి ని మాకు ఇచ్చి తెలంగాణాకి వేరే లిపిని పెట్టుకుంటారా? ఇక్కడ లక్షలు పెట్టి ఇళ్ళు కట్టుకున్న ప్రతీ ఒక్కరికీ ఎంత ఖర్చుపెట్టారో అంత డబ్బు ఇచ్చేస్తారా? ఊరికే మాట్లాడడం సులభం. మీరు కష్ట పడి సంపాదించిన ఆస్థి ఎవరైనా లాగేసుకుంటే - తీసుకొమ్మని ఇచ్చేస్తారా? ఈ రాష్ట్రం అందరిదీ అని అన్ని ప్రదేశాలకీ పరిశ్రమలు తీసుకు వస్తే - తెలంగాణా లో ఉన్నవన్నీ నావి. అని ఈ రోజు మాట్లాడుతున్నారు. అలాగే ఇంతకు మునుపు నిజాం ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర జిల్లాలనీ, కర్ణాటకా జిల్లాలనీ తెలంగాణా రాష్ట్రంలో కలపాలి కదా.... కేవలం ఈ 10 జిల్లాలే విడిపోతే అది సరి అయింది ఎలా అవుతుంది? తెలంగాణా లో ప్రాజెక్టులు కట్టే అవకాశం నిజంగా ఉన్నదా? సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న దక్కను పీఠభూమిలో ఎంతవరకూ డాములు కట్టగలము? తెలంగణా ప్రత్యేక రాష్ట్రం అయిపోతే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? చిన్న రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు అవసరం? అప్పుడు మరి ఈ ఉద్యమించిన నిరుద్యోగులు ఏమి చేస్తారు? ప్రత్యేక వరంగల్, ప్రత్యేక అదీలాబాద్ కావాలంటారా? కృష్ణా, గోదావరీ నదుల నీరు ఎన్ని జిల్లాలకి సరిపోతుంది? అస్సలు అక్కడ ప్రాజెక్టులు కట్టడం ఎంత వరకూ నిజంగా సాధ్యం? అస్సలు ముందు ఈ రాజకీయ నాయకుల పొట్టలు నింపడానికి వచ్చే నిధులు సరిపోతాయా? హైదరాబాదులో అన్ని రాష్ట్రాల వారూ ఉన్నారని చెబుతున్న వీరంతా అందరికన్నా ఎక్కువగా ఉన్న సాటి తెలుగువారిని ఎంత హీనంగా చూస్తున్నారు? "మాకు అన్యాయం జరిగింది.... మమ్మల్ని దోచుకుంటున్నారు.... మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం.... మా రాష్ట్రం మాకు ఇవ్వండి....." ఎన్ని సార్లు అలా మాట్లాడుతారు? "తెలంగాణాకి అడ్డమొస్తే అడ్డంగా నఱికేస్తాం" అని నినదిస్తున్న వారు విద్యార్ధులా? అలాగైతే ప్రతీ ఒక్క చిన్న రాష్ట్రాన్నీ ఇచ్చేయాలి. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ భారత ప్రభుత్వంలో విలీనం చేసిన సంస్థానాలన్నీ ఒక్కో రాష్ట్రంగా అవతరిస్తాయి. మళ్ళీ ఇంకో సారి మనం పర పాలనకి తెరలు తీద్దాం ! కష్టపడి సాధించుకున్న స్వరాజ్యాన్ని మళ్ళీ పరతంత్ర్యంగా మార్చేద్దాం. ఒకడి క్రింద బతకలేమని చెప్పి - మనలో మనమే కుమ్ముకొని వేరే వాడికి భారత దేశాన్ని సమర్పిద్దాం ! అమ్మా తెలుగు తల్లీ, నిన్ను దయ్యం అనేవారి నాలుకల్లో పలికే ఒక్కో తెలుగు మాటా సరైనదిలా వచ్చేలా చూడు తల్లీ! తెలుగు జాతికి సద్బుధ్ధి ప్రసాదించు - మాలో మాకు తగవులు పెడుతున్న వారిని గుర్తించి మమ్మల్ని ఒక్కటిగా ఉండేలా దీవించు తల్లీ! మూర్ఖులకి తెలివి నిచ్చి జాతి సమైక్యత ని విఛ్ఛిన్నం కాకుండా చూడు తల్లీ! నాకు తెలుసు - మళ్ళీ తెలంగాణా వాదులు చాలా పిచ్చి మాటలు రాస్తారని.... కానీ వారందరికీ ఒకటే విన్నపం. ఈ రాష్ట్రం అందరిదీ. అలాగే హైదరాబాదు నా రాష్త్ర రాజధాని కనుక నాది అనే హక్కు ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికీ ఉన్నది. నేను ముందు తెలుగు వాడిని, నా రాష్త్రం తెలుగు వారికి ప్రతీక కనుక నా రాష్త్రం విడిపోకూడదు అని ఆశించడం ప్రతీ ఒక్కరి హక్కూ, బాధ్యత కూడా. ఇప్పుడు జరిగిన అందోళనల వల్ల కలిగిన నష్టాన్ని ఉపయోగించి మన రాష్త్రంలో చాలా వెనుక బడి ఉన్న ప్రాంతాలని అభివృధ్ధి చేయగలిగే వారం. ఎదుటివారిని తిట్టడం సంస్కారం కాదు - చేతనైతే ఎదుటివారివద్దనుంచీ మంచి విషయాలను నేర్చుకోండి. కష్టపడకుండా ఎవ్వరూ ఏమీ సాధించలేరు. ఏ ప్రాంతం వారైనా కష్టపడగలిగే వారు తప్పక పైకి వస్తారు. మనది అనే మాటకి ఉన్న బలం నాది అనే మాటకి లేనే లేదు. ఐకమత్యంగా ఉంటే మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవాల్సి వస్తుందని - కొందరు పన్నిన ఎత్తుగడ ఫలించి, వేర్పాటువాదం ఎక్కువ అయ్యింది..... హైదరాబాదుకి రావలసిన ప్రాజెక్టులన్నీ చెన్నయ్ కీ, బెంగుళూరుకీ తరలిపోతున్నాయి. మన చేతులతో మనమే మన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాము.... అది గుర్తించండి. ఎదుటివారికి అవకాశాలు వస్తున్నాయని వాపోకుండా వారిలా మీరూ కష్టపడండి. మన చేతకాని తనాన్ని ఎదుటి వాడి దోపిడీ అనకండి -- హైదరాబాదు శివారు గ్రామాల్లో ఎకరాలకి ఎకరాలు కోట్లు కుమ్మరించి కొన్న వారిలో ఎక్కువ శాతం తెలంగాణేతరులే ! కష్టపడి పని చేయాలనుకునే ఎవ్వరూ మన అభివృధ్ధిని అపలేరు. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అదే ముఖ్యం. కానీ చదువులు మానేసి, రోడ్ల మీదికి ఎక్కితే అది వారికే నష్టం. ఈ సంగతి ఉద్యమాలు చేస్తున్న విద్యార్ధులందరూ అర్ధం చేసుకోవాలి.

11 comments:

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

TELANGAANAA UDYAMA GEETAALAKAI/PAATALAKAI..SARIYAGU.TAGU VIVARANAKAI..PLZ VISIT..http://www.raki9-4u.blogspot.com choodandi..mottam 25 geetaalu unnayi older posts koodaa choodandi..jai telangaanaa

kvsv said...

ప్రాజెక్టులు యెవరికి కావాలి?అబివృద్ది యెవరికి కావాలి?మా వెనకబాటుకు మీరే కారణం ..మాకో రాష్ట్రం ఇచ్యెయండి మేము గొప్పవాళ్లం అయ్యిపోతాము ...ఈ వాదనలు మాట్లాడే వారికి యలా తెలుస్తుంది మన బావిష్యత్తు నాశనం చేసుకునే దిశలో మనం నడుస్తున్నాం అని ఇప్పటికే రాన్నున్నా పెట్టుబడులు ఆగినయ్యి ఇక మిగతా వాళ్ళు తట్ట బుట్ట సర్దుకుని పోయే కాలం కూడా సమీపించింది ..

సత్యాన్వేషి said...

మల్లీ మొదలు పెట్టారా మీ వితండ ప్రాపగండాని?

మీ ఇంతకు ముందు పోస్టులో అదిగిన ప్రష్నలకు జవాబులు లేక చేతులు ఎత్తేసారు, ఇప్పుడు మల్లీ ఫ్రెష్ గా మొదలు పెట్టారు. ఇంతకూ మీ ఆవేషానికి అసలు కారణం ఈ క్రింది వాటిలో ఏదొ చెప్తారా?

1. హైదరాబాదు మీకు కాకుండా పొతుందన్న ఆక్రోషం.
2. తెలుగు వాల్లంత కలిసి ఒకటే రాష్ట్రంగా ఉండాలి. విడి పోవడం పాపం.
3. విడిపోతే ఆంధ్రా వాల్లకు నీల్లల్లో వాటా తగ్గిఫొతుంది. కాబట్టి కుదరదు.
4. విడిపోయినా తెలంగానా అభివ్రుద్ధి చెందదు (మీకు ఖచ్చితంగా తెలుసు). కాబట్టి విడిపోవడం వేస్టు.
5. విడిపోతామని తెలంగానా వాల్లంటే ఆంధ్రావాల్లు పడనివ్వరు, కాబట్టి గొడవలు తప్పనిసరి. అప్పుడు అభివ్రుద్ధికి నష్టం జరుగుతుంది.
6. హైదరాబాదుని మీ అంధ్రావాల్లే అభివ్రుద్ధి చేసారు కాబట్టి, హైదరాబదుని తీసుకుని విడిపోవడం మీకిష్టం లేదు.

పై వాటిలొ మీకు ఏది సరైనదిగా తోస్తుందో చెబితే మనము దాని గురించి మాట్లాడుకోవచ్చు.

సత్యాన్వేషి said...

You can go through this link for the proposed water projects in telangana which were never completed.

http://ourtelangana.com/content/telangana-irrigational-disparities-andhra-pradesh

Don't be under the impression that if you don't know the possibility of water projects does not mean that water projects are not possible at all.

నాలోనేను said...

బాగుందన్నా!!
మనకు ఏమి కావాలో తెలియదు.
అబివృద్ధి జరగక పోవడంకీ మన నాయకులను నిలదీయాలి కదా!
రెండు రకాల దురదృష్టాలు ఉన్నాయి. మన దురదృష్టం ఒకటి, పక్కవాడి అదృష్టం ఇంకొకటి.
ముందు మన ముందున్న దగుల్బాజీలను నిలదియ్యాలి.
రేపు మనకు ప్రత్యేక ప్రాంతం కావాలని అడుగుతూ పోతే అంతెక్కడికి

సత్యాన్వేషి said...

విరజాజి గారూ, మీరు రాసినా విషయాలన్నింటికీ మల్లీ మల్లీ సమాధానం ఇవ్వలేక ఈ తపాను రాసను. తీరిక దొరికినప్పుడు మీ కామెంట్సు ఇవ్వండి.

http://edisatyam.blogspot.com/2010/01/1.html
http://edisatyam.blogspot.com/2010/01/2.html

విరజాజి said...

@KVSV గారూ,
ఆ మాట చెబిటే వేర్పాటువాదులు వితండవాదం అంటున్నారు. అందరికోసం అలోచించేవారి ఆవేదన వీరి తలకి ఎక్కడం లేదు. ఏం చేస్తాం చెప్పండి.

నాలోనేను గారూ
మీరు అన్నమాటలు అక్షరాలా నిజమండీ.... అందరూ ఇలా ప్రత్యేక ప్రాతం కావాలని అడుగుతూ పోతే దానికి అంతేముంది. నా పాత టపాల్లో నాయకులను నిలదీయమంటే, మన మిత్రులు కరణ్ గారు ఇచ్చిన సమాధానాలు చూడండి. డబ్బు కోసం కొందరు రాజకీయ నిరుద్యోగులు ఆడే చదరంగంలో పావులు సామాన్య ప్రజలు అయిపోతున్నారు. పని గట్టుకొని సాటి తెలుగు వారి మీద విద్వేషాన్ని వెదజల్లుతున్న వారి మాటలు విని - మనలో మనం కొట్టుకోకూడదనే నా కోరిక కూడాను.


కరణ్ గారూ,

మీరు స్పందిస్తారని తెలుసు :-)

అస్సలు ముందు మీ సమస్య ఏమిటో చెబుతారా? నేను చేతులెత్తేశాను అంటున్నారు - ముందు చాలా సహనంగా జవాబు చెప్పాను, కానీ మళ్ళీ మీరు మొదలుపెట్టారు. మీరు అడిగిన పిచ్చి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పల్సిన అవసరం నాకు లేదు. ఇది నా బ్లాగు. నాకు నచ్చిన విషయం ఏదైనా నేను రాసుకుంటాను. ఆంధ్ర ప్రదేశ్ కి హైదరాబాదు రాజధాని కనుక దాని పై అందరికీ హక్కు ఉంది అన్నది అందరూ అంగీకరించాలి. అంతే గానీ హైదరాబాదు మాది అనడం తగదని నేను చెప్పాను. అంతకు మించి మీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు. హైదరాబాదు నా ఊరు. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే వారంతా ఒకటిగా ఉండాలని మంచి మాట చెప్పడం తప్పు అని మీరు అనుకుంటే అది మీ ఖర్మ. ప్రతీ ఒక్క విషయానికీ అన్యాయం అనే వారికి - ఎదుటి వారు ఏమి చెప్పినా తలకి ఎక్కదు. నేను మీకే కాదు - ప్రతీ ఒక్క తెలంగాణా వాదికీ ఇదే చెబుతాను. హైదరాబాదు అందరూ కలిసి అభివృధ్ధి చేసుకున్న ప్రాంతం - అందుకని హైదరాబాదు మాది మాత్రమే అనే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉమ్మడి ఆస్తి. తెలంగాణా అభివృధ్ధి జరగలేదని మీరు లింకులు ఇస్తే, జరిగిందనే గణాంకాల లింకులు చాలా ఉన్నాయి. ఊరికే వాదన పెంచడానికో, అనవసరపు కాల హరణానికో నేనిది రాయడం లేదు. ప్రతీ మనిషికీ జరుగుతున్న విషయాల మీద ఒక ఆవేదన ఉంటుంది. ఆ అవేదన వెలిబుచ్చడానికి ఎవ్వరి అనుమతీ అక్కరలేదు. మీరు లెక్కపెట్టి ఎన్ని పాయింటులు రాసినా, నిజం అనేది అందరికీ తెలుసు. రెచ్చగొడితే సమైక్య వాదులు కూడా మాట జారుతారు, అప్పుడు పొమ్మనక పొగ పెట్టవచ్చు అనుకుంటే అది చాలా తప్పు. తెలుగు వారు ప్రతీ ఒక్క మహా నగరంలోనూ ఉన్నారు. కానీ అక్కడినుచీ వారిని వెళ్ళమని ఎవ్వరూ అనడంలేదు. కానీ వారి స్వంత రాజధానిలో మాత్రం మీరు ఉండకూడదని, ఆ స్వంత రాజధానిపై వారికి ఎలాటి హక్కూ లేదు అని సాటి తెలుగు వారు మాట్లాడబట్టి అందరికీ ఆవేదన కలుగుతోంది. ఈ ఆవేదన నా ఒక్క అభిప్రాయమే కాదు, హైదరాబాదులో ఉన్న చాలామంది తెలంగాణేతరులది. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నాను. సాటి తెలుగు వారిని తూలనాడడం చాలా తప్పు. తెలంగాణా వేర్పాటు వాదులకి కూడా ప్రత్యేక రాష్ట్రం కాదు - హైదరాబాదే ముఖ్యం. రాష్ట్ర రాజధాని కాకుంటే హైదరాబాదు ఇంతగా అభివృధ్ధి చెందేది కాదు. అనవసరపు వాదనలు మాని - అన్ని ప్రాంతాలలోనూ ఉన్న అభివృధ్ధికి నోచుకోని ప్రదేశాలను బాగు పరిస్తే ఈ గొడవలు ఉండవు. అభివృధ్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న అపోహలోంచి, ఆంధ్రోల్లు అన్యాయం చేస్తున్నారనే తప్పుడు వాదనలోంచి ముందు బయట పడితే - మీకు అందరం కలిసి ఉంటే కలిగే ప్రయోజనం అర్ధం అవుతుంది. మీరు కూడా కొన్ని నిజాలు రాస్తూన్న ఈ క్రింది బ్లాగుని చూడండి.

http://anilroyal.wordpress.com

సత్యాన్వేషి said...

ఇది నా బ్లాగు, నా ఇష్టం అని మీరు గుర్తు చేసిన తరువాత చర్చ అనవసరం.

మంచు said...
This comment has been removed by the author.
మంచు said...

విరజాజి గారూ - Good Post and Very Good Response :-)

విరజాజి said...

ధన్యవాదాలండీ మంచు పల్లకి గారూ !!