Monday 23 November 2009

మా కలల క్రొత్త ఇల్లు

ఇన్నాళ్ళకి మా కల ఫలించి, మా స్వంత ఇంటి గృహప్రవేశం చేసుకున్నాము. కార్తీక శుక్ల ఏకాదశి నాడు మా నూతన గృహప్రవేశం జరిగింది. చిన్న చిన్న పనులు ఉండడంతో ఇంకా ఇల్లు మారలేదు. ఈ నెల ఆఖరుకల్లా మారాలని ప్రయత్నిస్తున్నాము. మొత్తానికి ఈ (అ)భాగ్యనగరంలో భాగ్యంకొద్దీ ఊరికి దగ్గరలో - (మణికొండ కి వెళ్ళే దారిలో షేక్ పేట్ దర్గా దగ్గర స్థలం కొని, ఇల్లు కట్టుకున్నాము) మాకంటూ ఒక స్వంత గూడు ఏర్పాటు చేసుకున్నాము.

సమయాభావం వల్ల ఈ విషయాన్ని బ్లాగులో ప్రస్తావించే వీలు లేకపోయింది. కానీ స్వంత ఇల్లు అనే కల ఇన్నాళ్ళకి నెరవేరినందుకు ఎంతో సంతోషంతో - చాయా చిత్రాలు రాగానే ఒక్క మాట చెప్పాలని మా ఇంటి చిత్రం మీ ముందు ఉంచుతున్నాను. ఇంటి కల సంగతి ఎలా ఉన్నా, ఇల్లు కట్టే కష్టాల గురించి తీరికగా మరో టపా..... ఇంకోసారి రాస్తానేం. ఉండనా మరి......!!

10 comments:

sunita said...

Congratulations.

సిరిసిరిమువ్వ said...

నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు.

జ్యోతి said...

అభినందనలు. ఈరోజుల్లో ఇండిపెండెంట్ ఇల్లు అంటే అదృష్టవంతులే.

Anonymous said...

చాలా బాగుందండీ మీ ఇల్లు. అభినందనలు.

cbrao said...

మీరు ఇప్పుడు భాగ్యవంతులయ్యారు.
అభినందనలు.

శేఖర్ పెద్దగోపు said...
This comment has been removed by the author.
శేఖర్ పెద్దగోపు said...

బాగుందండీ...హైదరాబాదులో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవాళ్ళంత అదృష్టవంతులు ఎవరూ ఉండరండీ...ఎన్ని లక్షలు పెట్టి కొన్న ఫ్లాటయినా ఇండిపెండెంట్ హౌస్ ముందు చిన్నబోవాల్సిందే!!

భావన said...

బాగుందండి ఇల్లు, నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు. మరి మాకు పార్టీ ఎప్పుడూ?

విరజాజి said...

సునీతగారూ, సిరిసిరిమువ్వ గారూ, విజయమోహన్ గారూ, వైదీక్ గారూ చాలా ధన్యవాదాలంఢీ!

జ్యోతిగారూ, సి బి రావు గారూ, శేఖర్ గారూ - నిజమే సుమంఢీ! చాలా రోజులు వెతికితే గానీ స్థలాన్ని అమర్చుకోలేకపోయాము. చాలా ఖరీదు అయినా - ఇంఢిపెండెంట్ ఇల్లు లో ఉన్న సుఖం అపార్టుమెంటులో ఉండదండీ.... మీరన్నట్లు ప్రస్తుతానికి (చాలా అప్పులున్న) భాగ్యవంతులమే ! :-)

భావనగారూ, పార్టీ ఇవ్వాలనే ఉందండీ.... మళ్ళీ పుస్తక ప్రదర్శనలో ఇ - తెలుగు స్టాలు పెట్టినప్పుడు కలుస్తాము కదా ... అప్పుఢు పార్టీ గ్యారంటీ !

రాజేశ్వరి నేదునూరి said...

bAguMdi mee kotta illu.