Friday 16 January 2009

తెలుగు సాహితి తొలి సమావేశం

తెలుగు సాహితి కార్యక్రమాలు మొదలయ్యాయోచ్ ! మా సంస్థాగత తెలుగు సాహితీ సమితి - "ఐ.బి.యం - తెలుగు సాహితి" జనవరి 8వ తారీకున పుట్టింది. మా తొలి సమావేశానికి దాదాపు 50 మంది హాజరయారు. ఆ సందర్భంగా నేను రాసిన కవిత.
క్య మనస్సులతో మనమంతా నడుం
బిగించి మనలోని భావుకతని మేల్కొల్పి,
యంత్రముల వలె జీవించక, సుందరమైన
తెలుగు భాషా మాధురీ దీప కాంతులని
లుప్తం కానీయక, చెక్కు చెదరనీయక
గురుతులన్నీ పదిలంగా భద్ర పరచుకొని,
సారవంతమైన మన మనో కమతాల్లో
హిరణ్య వర్ణాల పంట పండించడానికి
తిరిగి మన అమ్మ భాష నీడన చేరుదాం !
పెద్ద పెద్ద సంస్థల్లో ఇలాటి కార్యక్రమాలు జరిగితే మన తెలుగు ప్రచారం మరింత సులభతరం అవుతుందనే ఆకాంక్షతో ఈ విషయం మన బ్లాగు లోకానికి తెలియజేస్తున్నాను.
మా సమావేశ నివేదిక కింది బ్లాగులో చూడగలరు: http://ibmtelugusaahiti.blogspot.com/

4 comments:

శేఖర్ పెద్దగోపు said...

"చెక్కెర కలిపిన ........"
ఈ పాటకు శ్రీ బండారు చిట్టిబాబు గారు స్వరపరిచారు అనుకుంటా. ఆ మధ్య ఏదో కార్యక్రమంలో తెలిసింది. ఒకే ఒక్కసారి ఆ పాట విన్నాను. ట్యూన్ ఇంకా గుర్తుంది. చాలా బావుంటుంది. మీరు ఆడియో పెట్టి వుంటే ఇంకోసారి వినే భాగ్యం కలిగేది.

విరజాజి said...

మీకోసం పాట లంకె ఇస్తున్నాను. జాబితాలో "చక్కెర కలిపిన..." ఉంది చూడండి. మీరు ఉచితంగా దాన్ని దింపుకోలు (download) కూడా చేసుకోవచ్చు.

http://www.telugubhakti.com/telugupages/Music/index.html

cbrao said...

ఈ వ్యాఖ్య తెలుగు సాహితి రెండవ సమావేశ నివేదిక అనే టపా కు రాసినది. అక్కడ word Verification పని చేయని కారణంగా ఇక్కడ ఇస్తున్నాను. అక్కడ ఇబ్బందిపెట్టే word Verification తీసి వెయ్యగలరు.

మీ ప్రాంగణంలో తెలుగు పూలు వికసించటం ప్రమోదం. మీ కార్యక్రమాల ద్వారా ఎంతమంది తెలుగు బ్లాగులు చూస్తున్నారు? ఎంతమందికి తెలుగులో బ్లాగులున్నాయి? మీ I.B.M. సహచరుడైన మిత్రుడు మాగంటి వంశీ గురించిన కొన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_20.html

విరజాజి said...

@ చీ.భా.రావుగారూ, ప్రస్తుతం మా వాళ్ళు అంత ఎక్కువగా బ్లాగులు రాయడం లేదండీ. అయితే బ్లాగులు చూడాలని చాలామంది కోరిక వెలిబుచ్చడం చేత, నేను నా సమావేశ నివేదిక లో జల్లెడ, కూడలి ల వివరాలు ఇచ్చాను. నాకు తెలిసి నేను, మరొక మిత్రులు శ్రీయుతులు శ్రీపతి సనత్కుమార్ గారు (http://raata-geeta.blogspot.com) బ్లాగులు రాస్తున్నారు. ప్రస్తుతం మా సభ్యుల సంఖ్య 80. ఈ ఉగాదికి ఆ సంఖ్య పెరుగుతుందనే అనుకుంటున్నాము. బ్లాగుల గురించి ఒక వర్క్ షాప్ నిర్వహించాలని అనుకుంటున్నాము. జ్యోతి గారు, నల్లమోతు శ్రీధర్ గారు వస్తామని అన్నారు. కాకుంటే మాకు ఇక్కడ యాజమాన్యం నుంచీ అన్నీ అనుమతులు తీసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందరూ రాయక పోయినా, తెలుగు ని గురించి మంచి అభిరుచిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరైతే నాకు తప్పని సరిగా తెలుగులోనే ఉత్తరం రాస్తున్నారు. అంబరాన్నంటే ఉగాది సంబరాల్ని ఈ సారి మీతో పంచుకోవాలని ఆశిస్తూ,

మా I.B.M. స్ఫూర్తితో పెద్ద సంస్థల్లో తెలుగు వెలుగులు ప్రసరించాలని అభిలషిస్తూ,

మీ స్పందనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.