Friday 31 October 2008

తెలుగు భాష కి ప్రాచీన హోదా వచ్చేసిందోచ్

ఎన్నో రోజులుగా తెలుగు భాషాభిమానులంతా ఎదురు చూస్తున్న ప్రాచీన హోదా ప్రతిష్ట తెలుగు తల్లి పాదాల్ని అలంకరించింది. ఇది తెలుగు తల్లి బిడ్డలమైన మనమంతా అనదించాల్సిన విషయం. తెలుగు తల్లి సోదరి కన్నడ మాత కి కూడా ఆ గౌరవం దక్కింది. శతాబ్దాల చరిత గల మన మాతృభాష కి ఎన్నడో దక్కాల్సిన పట్టం ఈనాటికైనా దక్కినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. క్రీస్తు పూర్వం నించే తెలుగు భాష వాడుకలో ఉందనేదానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. మన దేశం లో అత్యధికులు మాట్లాడే భాష హిందీ కాగా, తెలుగు భాష రెండో స్థానం లో ఉంది. దాదాపు 15 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు ప్రపంచం మొత్తం మీదా ఉన్నారు. వారందరికీ ఈ శుభ సందర్భంగా నా హృదయ పూర్వక శుభాభినందనలు.
ప్రాచీన హోదా వచ్చిన ఫలితం గా మన భాషాభివృధ్ధి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. భాషా పురోభివృధ్ధికి ఒక మండలిని నెలకొల్పుతారు. అని కేంద్ర విశ్వ విద్యాలయాల్లో భాషా పీఠాలు ఏర్పాటు చెయ్యబడతాయి. భాషా విద్వాంసులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పురస్కారాలు ఇస్తారు. భాషా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. భాషా పరిశోధనా రంగం లో డాక్టోరల్ / పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ లు ఇస్తారు. మొత్తానికి దీనివల్ల క్రమంగా తగ్గిపోతున్న మన తెలుగు వెలుగుల్ని మళ్ళీ ఆజ్యం పోసి కాస్త పెంచుకునే అవకాశం వస్తుంది.
ఈ శుభ సందర్భంగా తెలుగు వారందరమూ ప్రాంతీయ భేదాలు మరచి తెలుగు తల్లి కాళ్ళకి మొక్కుదాము.జై తెలుగు తల్లి !!

1 comment:

Venky said...

ప్రాచీన భాష హోదా వచ్చింది. మరి దాని వలన ప్రయోజనాలేంటి అని అనుకుంటున్న నాకు జవాబు మీ బ్లాగులో దొరికింది. థాంక్యూ వెరీ మచ్.