Thursday 24 December 2009

తెలంగాణా విషయం పైనే ఎందుకు అత్యుత్సాహం ?

మీడియా తెలంగాణా విషయం పైనే ఎందుకు అత్యుత్సాహం చూపుతోంది? ప్రతీ ఛానల్ కేసీయార్ ప్రసంగాలనో లేక తెలంగాణా పై జరిగే సమావేశాల్నో ప్రత్యక్షంగా గంటలు గంటలు చూపిస్తున్నారు. మరి అదే విధమైన కవరేజ్ సమైక్యాంధ్ర నినాదానికి ఇవ్వడంలేదే? ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచీ ప్రతీ ఛానెల్ లో కళింగ భవన్ లో జరిగే సమావేశాన్ని చూపించి హోరెత్తిస్తున్నారు. అది అంత అవసరమా? ఓ పక్క గొడవలు, ఉద్వెగం ఎక్కువ అవుతుంటే, జనాల్ని ఇంకా రెచ్చగొట్టడానికి తప్పిస్తే ఇవన్నీ దేనికి? మరో విషయం నాకు అర్ధం కావడం లేదు. లగడపాటి హైదరాబాదు వస్తే గొడవలు అవుతాయి అన్నారు. మరి ఇలాటి సమావేశాలకి అనుమతి ఇస్తే గొడవలు కావా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా కేంద్రం నుంచీ తెలంగాణా కి సపోర్టు చెయ్యమని ఆదేశాలు అందినట్లు స్పష్టం గా తెలుస్తూనే ఉంది. రాష్ట్రం విడిపోవాలని కుట్ర జరుగుతోంది మొర్రో అని ఎందరు మొత్తుకుంటున్నా, ఒక్కరికి కూడా చీమ కుత్తినట్టు లేదు. ఈ దేశ భద్రత, సమగ్రత ఈ తెలంగాణా వాదులకి పట్టదు. బాగా అభివృధ్ధి చేసి హైదరాబాదు వీరి చేతిలో పెట్టి సీమా, ఆంధ్ర వారు వెళ్ళిపొతే, వీరి పొలాలు కోట్లు పెట్టి కొనే వారెవ్వరు? పరిశ్రమలు పెట్టేవారెవ్వరు? హైదరాబాదులో ఆంధ్రవాళ్ళు పరిశ్రమలు పెట్టారు - వారిది దోపిడీ అని అంటున్నారు కదా, మరి చాలా మంది డబ్బున్న తెలంగాణా వాదులు పరిశ్రమలు పెట్టవచ్చు కదా? ప్రతీ ఒక్కరికీ భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. కానీ మన ఖర్మ చూడండి. మన రాష్ట్రంలోనే సాటి తెలుగు వాడు మరో తెలుగువాడిని దోపిడీదారు అంటున్నాడు. అలా ఒక్క తమిళుడు మరో తమిళుని అంటాడా? ఒక గుజరాత్ వాడు మరో గుజరాతీని అంటాడా? ఏ భాషవారికీ, జాతి వారికీ లేని మాయరోగం - మనకే ఉంది. అదే అనైక్యత. అయ్యా, సమైక్య వాదులూ, విడిపోతామనే వీరికి బుధ్ధి చెప్పాలనుకుంటే, చెవిటి వాని ముందు శంఖమూదినట్లే. నా జన్మలో ఇలాటి రోజును చూడవలసి వస్తోందని కలలో కూడా అనుకోలేదు. తెలుగు వారంతా ఒకటే అని ఈ గొడవలు జరిగేవరకూ నాకు నమ్మకం ఉండేది. కానీ ఈ గొడవల వల్ల ఎంత మానసిక వేదన, సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది? రోజు గడవడానికి కూలి పని చేసుకునే వాడు తెలంగాణా వస్తే మహారాజు అయిపోతాడా? తెలంగాణా యాసలో పాటలు పాడడం కాదండీ.... ముందు సాటి తెలుగు వాడిని గౌరవించడం నేర్చుకోండి. తెలంగాణాలో పుట్టి పెరిగిన ఎంతో మందికి తెలంగాణేతర మూలాలు ఉన్నాయి. అయినంత మాత్రాన వాళ్ళకి హైదరాబాదు మీద, తెలంగాణా మీద హక్కు లేదనడం హాస్యాస్పదం. తెలుగు వారిని విడగొట్టే వారికి బుధ్ధి చెప్పాలే గానీ మనమే సహకరిస్తే ఎలా? మీరు తెలుగు వారు కాకుంటే ఇక తెలుగు లిపి వాడడం మానేయండి - అది ఆంధ్ర భాష. మానేస్తారా?

37 comments:

సత్యాన్వేషి said...

మీ వాదన అత్యంత పేలవంగా ఉంది.

1. నిన్నటిదకా అన్ని చాన్నెల్సూ ఆంధ్రా లో సమీక్యాంధ్ర పేరుతో జరిగే అబద్దపు దీక్షలూ, చిరంజీవి పర్యతనలు, విద్యార్థుల గొడవలు చూపించాయి, ఇవ్వాల తెలంగానా విషయాలు చూపిస్తున్నారు. ఎక్కడ హడావుది ఉంటె మీడీ అక్కడికి వెల్తుంది.

2. ఇప్పుడున్న పరిస్తితిలో ఎక్కడివాల్లు అక్కడే ఉంటే బెటర్. కేసీఆర్ ఆంధ్రా వచ్చినా, జగడపాటి తెలంగానా వచ్చినా గొడవలు తప్పవు. అందుకే రావద్దన్నది.

3. ఆంధ్రా వాల్లు హైదరాబాద్లో కంపెనీలు పెట్టొచ్చు, తెలుగువారు బెంగులూరు, పూనే, మద్రాసులో పెత్తవచ్చు, లేక గుజరాతీలు, మార్వాడీలు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకోవచ్చు. దానిని ఎవ్వరూ తప్పు పట్టలా. కానీ తెలనానా లో ఎక్కువగా ప్రవహించే క్రిష్నా, గోదావరీ జలాలను మొత్తంగా ఆంద్ధ్రాకి ఇవ్వడాన్నే దోపిడీ అన్నారు. కొంచెం విషయం తెలుసుకుని రాయండి.

4. తెలుగు వారంతా ఒక్కటే, సాటి తెలుగు వాన్ని గౌరవించండి అనే మాటలు హాస్యస్పదం. అసలు మనుషులంతా ఒక్కటే. మల్లీ తెలుగు, తమిల్ అని విభజించడం మీ కుసంస్కారం. అయితే ఏ ప్రాంతంలో వుండే సహజ వనరులపై ఆ ప్రంతపు వాల్లకు హక్కు ఉంటుంది. గోదవరీ జలాలను మనకూ కాదని రాజస్తాంకి ఇస్తే మనమంతా గోలపెడుతాం. అల్లగే తెలంగాణా ప్రాంత వనరులని తెలంగానా వాల్లకి కాకుండా చేస్తున్నందుకే ఈ ప్రస్తుత పరిస్తితి.

Vissu said...
This comment has been removed by the author.
Raj said...

Karan Godavari krishna jalalu istee telamgaana avasaram ledaa...ante aa neellato telangana sasyashyamalam avutundaa...do u have any fact sheet on this?...i do blabber like you..but need facts..
ఇది మరీ విడ్దూరం:
ఉస్మానియాలో జరిగిన విధ్వంసాలకు కారణం లగడపాటి , మోహన్ బాబు , చిరంజీవిట...
ఫొటోలున్నయికదా పేపర్లో మొదటిపేజీలోవేసి వారిని గుర్తుపట్టి ఎవరో తేలిస్తె సరి...

రేపు హర్రిష్రావు అంటాడు ఇది ముమ్మటికి అంధ్రా గూండాలపనే అని..

మీడియా మీ వద్ద ప్రూఫులున్నయి కబట్టి అవి ప్రభుత్వానికి సమర్పిస్తే వారిని వెంటనే అదుపులోకి తీస్కుంటారు..

సత్యాన్వేషి said...

1. Factsheet? Find yourself what is the river catchment area of telangaanaa and aandhra and what is the amount of land under irrigation in both places.

2. It is not new for aandhra leaders to bring goondas and make peaceful protests violenet. Previously YSR did this in 1992 hyderabad riots, 2002 electricity charges protests. Now his son is continuing the legacy.

You can see today's visuals: when students are protesting, some goondas beat TDP MLAs.

3. When not even one vehicle was damaged and all students were in university, police went inside hostels and beat students and caused 4 student deths. See the disparity..they watch gaping when crores of worth BSNL cables are burnt.

సత్యాన్వేషి said...

Nobody knows the rationale of aandhra peoples claim that andhra people developed Hyderabad. But for sure andhra leaders destabilized the 400 years of harmony in hyderabad by bringing goondas from andhra to remove CMs from power.

విరజాజి said...

@కరణ్ గారూ,

నిన్నటిదాకా కూడా కేవలం ఆంధ్రా, రాయలసీమ మొత్తాన్ని, అక్కడి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలనీ నిరంతరమూ మీడియా చూపలేదండీ. అప్పుడు కూడా తెలంగాణావాదులని స్టూడియోలకి పిలిపించి మరీ చర్చలు జరిపింది. కానీ ఈరోజులా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు చెయ్యలేదు.


తెలంగాణా పేరుతో ఒక్క కేసీయార్ చేసిన అబధ్ధపు దీక్ష చూసి అందరూ అలా చేస్తారనుకోవడం మీ భ్రమ. ఎవరి ప్రాంతీయ భావాలు వారివి.


కృష్ణా, గోదావరీ జలాల విషయం కోసం తెలంగాణా అక్కరలేదండీ. సరైన ప్రాజెక్టులు కట్టమని ఆయా నియోజక వర్గ నాయకులని నిలదీయండి. ప్రత్యేక తెలంగాణా వల్ల మీకు అభివృధ్ధి జరుగుతుందని అనుకుంటే - అది మీవరకు సహేతుకమేమో కానీ, తెలంగాణా సాధించడానికి ఇతరులని తిట్టడం చాలా తప్పు. మీ వనరులను ఎవ్వరూ వాడుకోవట్లేదు. హైదరాబాదులో ఆంధ్రోల్లు దోపిడీ చేస్తున్నారు అన్న విషయాన్ని గురించి నేను రాశానే కానీ - మిగతా విషయాల గురించి కాదు.

మరో మాట కూడా ఉంది - రాష్ట్రాన్ని విభజిస్తే, ఆంధ్రావాళ్ళ వాటా తగ్గుతుందనుకుందాం, కానీ తెలంగాణా వాటా దక్కుతుందని కూడా చెప్పలేము. ఒకరాష్ట్రానికే సరిగ్గా నీటి కేటాయింపులు జరగడంలేదు. ఇక రెండు రాష్ట్రాలకి ఏమి జరుగుతాయి? నాయకులు సంకుచితంగా మాట్లాడితే - అవే పట్టుకుని ఎదుటివారిని తప్పుగా మాట్లాడటం సరి కాదు.

మనుషులంతా ఒక్కటే అని మీరు నిజంగా అనుకుంటే, ఎదుటివాడు మంచి చెబుతున్నారు అని అస్సలు అలోచించకుండా, మా వాదనే సరైనది అని అనరు. నేను చెప్పిన విషయం అందరికీ నచ్చాలని లేదు. కానీ అసంబధ్ధంగా వితండవాదం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు.

గూండాలను తెచ్చేది ఎవరైనా నిస్సందేహంగా ఖండించాల్సిందే. అస్సలు హైదరాబాదు లో ఆ సంస్కృతి మొదలైంది చెన్నారెడ్డి హయాం లో అని మరచిపోతున్నారు. మా చిన్నపుడు కర్ఫ్యూల నగరమని హైదరాబాదు అనగానే అందరూ భయపడేవారు. తుఛ్చ నాయకుల గురించి మాట్లాడకుండా - అందరినీ కలిపి మీ అంధ్రోల్లు, మీ అంధ్రోల్లు అనడం తప్పని మాత్రమే నేను చెప్పాను.

మరో మాట కూడా చెప్పాలి. తెలంగాణా గురించి, అక్కడి అభివృధ్ధి గురించి మాట్లాడినప్పుడు హైదరాబాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాలను మినహాయించి మాట్లాడుతారు. అదే విభజనకి వచ్చేసరికీ - హైదరాబాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావే అంటారు. ఆంధ్రోల్లు దోపిడీ దారులైతే వారి డబ్బంతా ఇక్కడ పెట్టుబడి ఎందుకు పెడతారు? ఇక్కడి సొమ్ము తీసుకెళ్ళి అక్కడ పెడతారు కానీ....?? చిన్న పిల్లలని అడిగినా, అంత పారిశ్రామికీకరణ, అభివృధ్ధి వారివల్ల జరిగాయని ఎవరైనా చెబుతారు. ఈ గొడవల వల్ల నష్టమే కానీ లాభం లేదు. తెలంగాణా మావోయిష్టుల చేత చిక్కుతుందని ఎవరైనా చెబితే, కొట్టి పారేస్తారు. కానీ ప్రస్తుతం హైదరాబాదులో ఎందరు మావోయిష్టులు ఉన్నారో తెలుసా? పైగా తెలంగాణా ఉద్యమానికి మా మద్దతు అని మావోయిస్టులు ప్రకటిస్తున్నారు. దేశ భద్రత గురించి ఎవరైనా సరే అలోచించాలి. ఏ రాష్ట్రమైనా, మన దేశ సమగ్రత కి భంగం వాటిల్లేలా ఉండకూడదు.

నిజంగా తెలంగాణా బాగుపడాలంటే, ప్రత్యేక రాష్ట్రం కాదు - విదర్భకి ఇచ్చినట్లు ప్రత్యేక పాకేజీని అడగండి. ఒక్క పైసా కూడా తెలంగాణేతర ప్రాంతాలకు ఖర్చు చెయ్యకుండా - తెలంగాణా నాయకులని కేవలం తెలంగాణాకే ఖర్చు పెట్టమనండి.


@రాజ్ గారూ,

మీరు చెప్పింది నిజమే. కానీ జనాలకి చెత్తవెధవల మాటలే ఎక్కుతాయి. ఇప్పుడు ఏ అన్యాయం జరిగినా, ఏ సంఘటన జరిగినా, సీమంధ్ర నాయకులపైన నెపం వేస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం స్పాన్సర్డ్ ఉద్యమం అనడంలోనే ఇక్కడి నాయకుల కుసంస్కారం బయట పడుతోంది. ఏది ఏమైనా, మొత్తానికి అందరూ కలిసి మన తెలుగు వారిని బజారుకి ఈడ్చారు. కేసీయార్ మాత్రం ఈ పాపానికి ఫలితం తప్పక అనుభవిస్తాడు.

సిరిసిరిమువ్వ said...

ఈ చానళ్ల పక్షపాతం అంతా ఇంతా కాదులేండి. అసలు ఈ వార్తా చానళ్లన్నిటిని ఓ నాలుగు రోజులు మూసేస్తే కాని పరిస్థితులు కాస్త చక్కపడవు.

Unknown said...

అసలు పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలాలు ఎక్కడో మనందరికి తెలుసు..ప్రతి గ్రామానికి ఒక భుస్వామి(కులం పేరు నేను రాయతల్చుకోలెదు) వాడి ముందు ఊరివారందరూ చేతులు కట్టుకొని నుంచోవల్సిందే..ఈ వ్యవస్థని భరించలేక నక్సలిజం పుట్టిందని చరిత్ర చెప్తుంది....అది మన చరిత్ర..మన పులకేసి ఎప్పుడు అందుకే ఈ పెట్తుబడిదారులు ,వలసవాదులు అని అంటుంటాదు..ఆయన మూలాలు కుడా అవేకదా..

హైదరాబాద్ మనందరిది..దాని మీద నెగటివె రైట్స్ మాకే ఉన్నయి అంటే ఎవరూ ఒప్పుకోరు..మనందరికి తెలుసు "చేరి మూర్ఖుని మనసు రంజింప చేయలేమని " అందుకే ఇక్కడ ఎవరూ సమైక్య ఉద్యమాలు చెయ్యరు..చెయ్యాల్సింది ,చెయ్యాల్సిన వారిముందు,చెయ్యాల్సిన టైంలో చేస్తారు..

చదువరి said...

ఊరికే నీళ్ళను కొల్లగొట్టారని ఆరోపిస్తే సరికాదు. కృష్ణా గోదావరీ జలాల్లో కనీసం తమకు కేటాయించిన వాటా వరకైనా తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేసారో చెప్పాలి. ఏ ఒక్క ప్రతినిధిని కదిలించినా.. ఒకటే జవాబొస్తది -"ఆంద్రోళ్ళు మన నీళ్ళు దోపిడీ చేసారు". మరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? ఎమ్మెల్యే క్వార్టర్ల మెస్సుల్లో తిని, శాసనసభలో నిదర్లు పోయారా?
...........

ఆ యూనివర్సిటీలో తెదేపా నాయకుణ్ణి కొట్టిన చోటే వాళ్ళ వాహనాలను ధ్వంసం చేసి, తిరగేసి పడేసిన దృశ్యాలు చూసాం. అవి కూడా ఫలానావారి గూండాల పనులేనా?
...........

ఇక హై.లో నాలుగొందలేళ్ళ హార్మొనీ గురించి.. అప్పటి రజాకార్లకు సామాన్యులకు మధ్య నెలకొన్న అద్భుతమైన హార్మనీ గురించి, ఆ రజాకార్ల వారసులైన ప్రస్తుత పాతబస్తీ నాయకులకూ హిందువులకూ మధ్య వారసత్వంగా వెల్లివిరుస్తున్న హార్మనీ గురించి మేమసలేమీ ఎరగంలెండి.

కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకులు సాటి తెలుగువాడి పట్ల - ఎవరితోనైతే అన్నల్దమ్ముల్లాగా విడిపోదామని అంటున్నారో ఆ సోదరుల పట్ల - చూపుతున్న అమర్యాద, తత్కారణంగా ఇక్కడి ప్రజల మధ్య ఏర్పడిన హార్మనీ గురించి మాకు బాగా తెలుస్తోంది. విరజాజి గారు సరిగ్గా ఎత్తిచూపినట్టు.. తమ ద్వేషపూరిత పాటల ద్వారా తెలంగాణ గాయకులు వెదజల్లుతున్న హార్మొనీ ఎంతలా గుబాళిస్తోందో కూడా మాకు బాగా తెలుస్తోంది.

సత్యాన్వేషి said...

1. >>"కృష్ణా, గోదావరీ జలాల విషయం కోసం తెలంగాణా అక్కరలేదండీ. సరైన ప్రాజెక్టులు కట్టమని ఆయా నియోజక వర్గ నాయకులని నిలదీయండి"
నియోజక వర్గాల నాయకులు ఎప్పటినుంచి ప్రాజెక్టుల విషయంలో నిర్నయాలు తీసుకుంటున్నారు? మీ ఊర్లో ఎమ్మెల్యేలే ప్రాజెక్టులు డిసైడ్ చేస్తారా? వైఎస్సార్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి ఉంది ఉన్న నీల్లన్నీ రాయలసీమ తరలిస్తే ఇక్కడీ నీటిపారుదల మంత్రికూడ సొంత నొయోజకవర్గానికి ఒక ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయాడు.
2. >>"మరో మాట కూడా ఉంది - రాష్ట్రాన్ని విభజిస్తే, ఆంధ్రావాళ్ళ వాటా తగ్గుతుందనుకుందాం, కానీ తెలంగాణా వాటా దక్కుతుందని కూడా చెప్పలేము."
తమరు కాస్తా ఎలిమెంటరీ లెక్కలు నేర్చుకోవాలి. రాష్ట్రాలు విభజించినంత మాత్రాన జనాభా గానీ, భూమి గానీ పెరగవు. అప్పుడు ఆ రాష్ట్రం తనకు అలొకేట్ చేసిన టీఎంశీల నీటిని వాడుకొంతుంది.లేక ఇది కూడా మీకు తెలియదా?

3. >>"కానీ అసంబధ్ధంగా వితండవాదం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. "
ఒక రాష్ట్రాన్ని విభజించమని అడిగితే, ఇదేదో దేషన్ని విడగోట్టే కుట్ర అని చెప్పిన మీకు వితండవాదం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా? నేను చెప్పేదే నిజమని నేను చెప్పట్లా..కానీ మీరు చెప్పేవి అసంబద్ధమయిన వితండ వాదాలు అని చెప్పడానికి పెద్దగా బుర్ర అక్కర్లేదు.

4. >>"తుఛ్చ నాయకుల గురించి మాట్లాడకుండా - అందరినీ కలిపి మీ అంధ్రోల్లు, మీ అంధ్రోల్లు అనడం తప్పని మాత్రమే నేను చెప్పాను."
హైదరాబాబుని మేమే డెవలప్ చేసామని చెప్పుకునే ఆంధ్రా నేతలు హైదరాబద్ ని ఏవిధంగా గొడవలు లేవదీసారో చెప్పడమే ఇక్కడ ఉద్దేసం.

సత్యాన్వేషి said...

1. >>"తెలంగాణా పేరుతో ఒక్క కేసీయార్ చేసిన అబధ్ధపు దీక్ష చూసి అందరూ అలా చేస్తారనుకోవడం మీ భ్రమ. ఎవరి ప్రాంతీయ భావాలు వారివి."

ఆంటే మీ ఉద్దేషం ఏమిటి? తెలంగానా లో అంతా నిరాహార దీక్షలు చేస్తే కాని తెలంగాన రాష్ట్రం రాగూదదా?

సత్యాన్వేషి said...

1. >>"తెలంగాణా సాధించడానికి ఇతరులని తిట్టడం చాలా తప్పు. మీ వనరులను ఎవ్వరూ వాడుకోవట్లేదు."

మేమెవరినీ తిట్టట్లేదు. మా రాష్ట్రాన్ని మాకిస్తే మా నీటిని మేము వాడుకొంటాము. మిమ్మల్ని తిట్టల్సిన అవసరం తెలంగానా వాల్లకెందుకు?

మా వనరులెవ్వరూ వాడుకోవత్ళేదండం మీ అగ్నానాన్ని తెలియచేస్తుంది. మీరు చెప్పేది నిజం అనుకుంటే దానికి కాస్తా రుజువులు చూపించండి. లేకపోతే క్రిష్నా నీల్లు ఎడమన ఉన్న మహబూబ్ నగర్ తడపకుండా కర్నూలుకు మాత్రం ఎందుకు నీలిస్తాయి, నల్లగొండకు చేరకుండా గుంటూరు మాత్రమే ఎందుకు వెల్తాయో కొంచెం విడమరిచి చెప్పండి.

సత్యాన్వేషి said...

@ రవి

అసలు పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలాలు ఎక్కడో మనందరికి తెలుసు..ప్రతి గ్రామానికి ఒక భుస్వామి(కులం పేరు నేను రాయతల్చుకోలెదు) వాడి ముందు ఊరివారందరూ చేతులు కట్టుకొని నుంచోవల్సిందే..ఈ వ్యవస్థని భరించలేక నక్సలిజం పుట్టిందని చరిత్ర చెప్తుంది....అది మన చరిత్ర..

ఆ భూస్వాములనుంచి స్వేచ్చకోసమే తెలంగానా సాయుధ పోరాటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ భూస్వాములకన్నా ఆంధ్ర నేతల దౌర్జన్యాలే ఎకూవయ్యయి. అందుకే ఇది మరో పోరాటం.

సత్యాన్వేషి said...

>>"నిజంగా తెలంగాణా బాగుపడాలంటే, ప్రత్యేక రాష్ట్రం కాదు - విదర్భకి ఇచ్చినట్లు ప్రత్యేక పాకేజీని అడగండి."

మరి ఈ తెలంగానా ఇష్యూ కనీసం ఈ మధ్య టీఆరెస్ వచ్చిన తరువాత పదేల్లనుంచైనా ఉంది కదా. అప్పటినుచైనా ఆ పాకేజీ ఏదో ఇస్తే ఇది ఇంత పెద్దగా అయ్యేది కాదు కదా? ప్రస్తుత పరిస్తితికి కారనం 2004 ఎన్నికల్లో తెలంగానా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ఆ విషయాన్ని తుంగలోకి తొక్కి, ఈ అయిదేల్లలో ఉన్న కొద్ది జలాల్ని కూడా పోలవరం, పోతిరెడ్డిపాడు పేర్లతో ఆంధ్రాకి తరలించడంవల్లే.

సత్యాన్వేషి said...

>>"తెలంగాణాలో పుట్టి పెరిగిన ఎంతో మందికి తెలంగాణేతర మూలాలు ఉన్నాయి. అయినంత మాత్రాన వాళ్ళకి హైదరాబాదు మీద, తెలంగాణా మీద హక్కు లేదనడం హాస్యాస్పదం"
అలా అని ఎవరన్న అన్నారా. లేక మీరే కలగన్నారా? తెలంగాణా రాష్ట్రం ఏర్పిడినంత మాత్రాన ఇక్కడి ఆంధ్ర వాల్లను, మార్వాడి, గుజరాతీ వాల్లను మిగతా వాల్లనీ ఎవ్వరూ వెల్లమనలేదు. మీ అనవసర భయాలు మానండి. హైదరాబద్ లొ ఉన్న ఆంధ్రా సెటిలర్స్ అసోసియేషన్ కుడా తెలంగానాకి మద్దతు ఇచ్చింది.

సత్యాన్వేషి said...

>>"రాష్ట్రం విడిపోవాలని కుట్ర జరుగుతోంది మొర్రో అని ఎందరు మొత్తుకుంటున్నా, ఒక్కరికి కూడా చీమ కుత్తినట్టు లేదు. ఈ దేశ భద్రత, సమగ్రత ఈ తెలంగాణా వాదులకి పట్టదు."

ఇది అతిషయోక్తిలా అనిపించడం లేదూ? ఈ దేషభద్రతకీ, తెలంగానా రాష్ట్రం వల్ల తేడా ఎలా వచ్చిందో? ఇదేదొ ఐఎస్సై కుట్రలాగా అభివర్నిచడం మీకే చెల్లింది. అవును మరి గూండా రాజకీయాలు తెలియని తెలంగానా వాల్లు సొంత రాష్ట్రంగా ఏర్పదితే రాయలసీమ ఫాక్షనిస్టులనుంచీ, కొస్తాంధ్ర రౌడీ జులుం నుంచీ తమను కాపాడుకోలేరని మీ భయమా? అందుకే కాబోలు అడపా దడపా కోస్తాంధ్ర నుంచి రౌడీలని దించి ఇక్కడి ముఖ్యమంత్రులని దించేస్తారు.

Anonymous said...

"దోపిడి చేసే ప్రాంతేతరులను, దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే, ప్రాణంతోనే పాతర వేస్తం"
— కాళోజి

సమతలం said...

KARAN Garu
కనీస 50 ఏండ్ల గతాన్ని చూడని వాళ్లతో, ఆ గతాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించని వాళ్లతో, తెలిసినా ఆ అన్యాల గురించి మీ నాయకులను అడగండి అనే వాళ్లతో మాట్లాడం వృధా. మన నాయకులే వీళ్ల తొత్తులు. మన కొన్ని ప్రాంతాలనే పూర్తిగా దురాక్రమణ చేసారు. ఈ ఆదిపత్య, అహంభావ, అమానవీయ సహచరులను వదిలించుకోవల్సిందె.

సత్యాన్వేషి said...

@ చదువరి
>>"ఇక హై.లో నాలుగొందలేళ్ళ హార్మొనీ గురించి.. అప్పటి రజాకార్లకు సామాన్యులకు మధ్య నెలకొన్న అద్భుతమైన హార్మనీ గురించి, ఆ రజాకార్ల వారసులైన ప్రస్తుత పాతబస్తీ నాయకులకూ హిందువులకూ మధ్య వారసత్వంగా వెల్లివిరుస్తున్న హార్మనీ గురించి మేమసలేమీ ఎరగంలెండి"

తమరికి తెలిసిన చరిత్ర ఎంతో కానీ, రజాకార్లతో యుధ్ధం లో ఎంతోమంది ముస్లిములు తెలగానా సాయుధ పోరాటంలో పంచుకున్నారు. ముఖ్య నేత, ప్రజాకవి మక్దూం మొహియుద్దిన్ కూడా ముస్లిమే మరి.

నిజాం పాలనలో అసలు దోపిడీదార్లైన దేష్ముఖ్లనబడే దొరలు హిందువులే మరి. తెలంగానా సాయుధ పోరాటం హిందు..ముస్లిం పోరాటం కాదు తేడా తెలుసుకోంది. ఇక్కడ ప్రజలు కలిసి జీవిస్తోంటే రౌడీలను దించి మతకలహాలను రెచ్చగొట్టింది సీమాంధ్ర నేతలే మరి.

సత్యాన్వేషి said...

>>"గూండాలను తెచ్చేది ఎవరైనా నిస్సందేహంగా ఖండించాల్సిందే. అస్సలు హైదరాబాదు లో ఆ సంస్కృతి మొదలైంది చెన్నారెడ్డి హయాం లో అని మరచిపోతున్నారు"

నేను చెప్పేది కూడా అదే. చెన్నారెడ్డి హయాంలో ఆయనను దించడానికి కొందరు బడా సీమాంధ్ర నేతలే గూండాలని దించారు.

చదువరి said...

Karan Kumbh: వాదనను కప్పగెంతులేయించకండి. మీరన్నదిది: "But for sure andhra leaders destabilized the 400 years of harmony in hyderabad.." దీనికి నేనిచ్చిన సమాధానం అది.

సత్యాన్వేషి said...

@ చదువరి

దాని గురించే నేనూ చెప్పింది. హార్మనీకి, రజాకార్లకూ సంబంధం ఏమిటి? వాదనను కప్పగంతులు పట్టిస్తుంది మీరే మరి. ఇక్కడ భూస్వములతో, వాల్ల కపు గాచే రజాకార్లతో కమ్యూనిస్టులు యుద్ధం చేసారే గానీ ముస్లిము సోదరులతో కాదు. హిందూ ముస్లిముల మధ్య హార్మనీ రజాకార్లతో చెడిపోలేదు.

కానీ ఆ తరువాత కొందరు సీమాంధ్రకు చెందిన కాంగ్రేసు నాయకులు తమ స్వార్ధం కోసం గూండాలను పెట్టి ఇక్కడ హార్మనీ దెబ్బతీసారు.

సత్యాన్వేషి said...

>>>"తెలంగాణా మావోయిష్టుల చేత చిక్కుతుందని ఎవరైనా చెబితే, కొట్టి పారేస్తారు. కానీ ప్రస్తుతం హైదరాబాదులో ఎందరు మావోయిష్టులు ఉన్నారో తెలుసా? పైగా తెలంగాణా ఉద్యమానికి మా మద్దతు అని మావోయిస్టులు ప్రకటిస్తున్నారు. దేశ భద్రత గురించి ఎవరైనా సరే అలోచించాలి. ఏ రాష్ట్రమైనా, మన దేశ సమగ్రత కి భంగం వాటిల్లేలా ఉండకూడదు."

మావోయిస్టులు తెలంగాణాలో ఉన్నారు, కర్నూలులోని నల్లమలలో ఉన్నారు, దేషంలో చాలా చోట్ల ఉన్నారు. అసలు నక్సలిజం ఏఫీ లో స్టర్ట్ అయ్యింది శ్రీకాకులం నుంచి.

నక్సలిజం పుట్టిందే ప్రజల ఆర్ధిక అసమానతలవల్ల. నీటివనరులు సరిగా ఇస్తే నక్సలిజం అదే పోతుంది. అసలు నక్సలిజం తెలంగానాలో ఇంతగా పెరిగిపోవడానికి కారనం తెలంగానాపై పాలకులు చూపిన నిర్లక్ష్యమే.

సత్యాన్వేషి said...

>>>"మరో మాట కూడా చెప్పాలి. తెలంగాణా గురించి, అక్కడి అభివృధ్ధి గురించి మాట్లాడినప్పుడు హైదరాబాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాలను మినహాయించి మాట్లాడుతారు. అదే విభజనకి వచ్చేసరికీ - హైదరాబాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావే అంటారు. ఆంధ్రోల్లు దోపిడీ దారులైతే వారి డబ్బంతా ఇక్కడ పెట్టుబడి ఎందుకు పెడతారు? ఇక్కడి సొమ్ము తీసుకెళ్ళి అక్కడ పెడతారు కానీ....?? చిన్న పిల్లలని అడిగినా, అంత పారిశ్రామికీకరణ, అభివృధ్ధి వారివల్ల జరిగాయని ఎవరైనా చెబుతారు. ఈ గొడవల వల్ల నష్టమే కానీ లాభం లేదు. "

తెలంగానాకి వచ్చి ఆంధ్రా వాల్లు వాల్లు సొంత లాభం కోసం వ్యాపారాలు చేసుకున్నారు. ఆ వ్యాపారాలు అలాగే ఉంటాయి. తెలంగానా రాష్ట్రం అయినంత మాత్రానా వాల్ల వ్యాపారాలు ఎటూ పోవు. తెలుగు వాల్ల వ్యాపారాలు బెంగులూరు, పూనే, దిల్లీ, అమెరికా లాంటి అనేక చోత్ల ఉన్నాయి. అది మాన్ రాష్ట్రం కానంత మాత్రానా వాల్ల వ్యాపారాలు ఎవరూ లగేసుకోలేదు.

అలాగే మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు తెలుగు వాల్లా వ్యాపారాలు, సినిమా పరిశ్రమ అంతా మద్రాసులో ఉంది. అలాగని చెప్పి మనవాల్లు మద్రాసునుండి విడిపోలేదా?

చదువరి said...

Karan Kumbh : హైదరాబాదు హార్మొనీ గురించి మాట్టాడింది మీరు. హై.లో హార్మొనీ లేదు సరిగదా.., రజాకార్ల ఆధ్వర్యంలో గొడవలు జరిగాయి, ఆ రజాకార్ల వారసులే ఇప్పుడు పాతబస్తీని ఏలుతున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. అని నేను అన్నాను. అయితే మీరు ఒక్కసారి హై. నుండి గ్రామీణ తెలంగాణకు గెంతి, దేశముఖుల గురించి, కమ్యూనిస్టుల గురించి మాట్టాడుతున్నారు. హైదరాబాదు గురించి మీరు మాట్టాడిన ముక్కకు కట్టుబడి ఉండండి ముందు. ఆ తరవాత దేశముఖుల కాడికి పోదురుగాని.

సత్యాన్వేషి said...

ఎమైఎం మూలాలు రజ్వీతో ముడి పడీ ఉండడానికి, ప్రస్తుత వాదనకి సంబంధం ఏంటి? రజాకార్ అనే ఒక మిలీషియా తెలంగానా సాయుధ పోరాటాన్ని అనచడానికి పుట్టింది, హిందువులకి వ్యతిరేకంతో కాదు. రజాకార్లు దౌర్జన్యాలు చేసింది తెలంగానా పల్లెల్లో. ఆ రజాకార్లను ఎదిరించింది నాటి కమ్యూనిస్టులు.

హైదరాబాబులో ఉన్న సగటు హిందువులూ, ముస్లిములూ సఖ్యతతోనే ఉన్నారు. రజాకార్లవల్ల హిందూ ముస్లిము ఐక్యత దెబ్బ తినలేదు. 1990లోని దారున కాష్టానికి కారనం రాయలసీమ గూండాలే మరి, ఎమైఎం కాదు. నేనిక్కడ ఎమ్మైఎమ్ను వెనకేసుకుని రావడం లేదు, హైదరాబాదులో హిందూ ముస్లిములు కలిసి ఉన్నారని మాత్రమే చెప్పాను.

చదువరి said...

Karan Kumbh: 1930ల్లో నైజాంలో ఆర్యసమాజ్ బలంగా ఎదిగింది. ఆ దశకంలోనే లక్షలాది ముస్లిములు ఉత్తర భారతం నుండి లక్షలాదిగా హైదరాబాదుకు తరలివచ్చారు. కాదు, నిజాము వీళ్ళను తెప్పించాడు. ఆ తరవాత వాళ్ళనే రజాకార్లలో చేర్చారు. ఆ సమయంలోనే -ముప్పయ్యో దశకం చివర్లో - హైదరాబాదులో మొదటి హిందూ ముస్లిము గొడవలు జరిగాయి. ఆ తరవాతి కాలంలో హిందూ ముస్లిముల మధ్య నెలకొన్నది అభద్రతే తప్ప, మీరంటున్నట్టు అద్భుతమైన హార్మొనీ యేమీ లేదు.

మీరు చెప్పిన ఆ రాజకీయపు గొడవలు జరగలేదని నేను అనడం లేదు. కానీ హైదరాబాదులో అద్భుతమైన హార్మొనీయో హార్మోనియమో ఉందనీ దాన్ని 'ఆంద్రోళ్ళే' చెడగొట్టారనీ అనడం హాస్యాస్పదం. మీకు చరిత్ర తెలీక కాదు, 'ఆంద్రోళ్ళ' మీద నిందలు వేసే సగటు తెలంగాణవాది నైజం మీతో ఈ మాటలు పలికిస్తోంది.

విరజాజి said...

ముందుగా నేను సమతలం గారికి సమాధానం చెప్పదలచుకున్నాను.
>> కనీస 50 ఏండ్ల గతాన్ని చూడని వాళ్లతో, ఆ గతాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించని వాళ్లతో, తెలిసినా ఆ అన్యాల గురించి మీ నాయకులను అడగండి అనే వాళ్లతో మాట్లాడం వృధా. మన నాయకులే వీళ్ల తొత్తులు. మన కొన్ని ప్రాంతాలనే పూర్తిగా దురాక్రమణ చేసారు. ఈ ఆదిపత్య, అహంభావ, అమానవీయ సహచరులను వదిలించుకోవల్సిందె.

వదిలించుకోవాలనే మాట మీరు అస్సలు ఎలా అన్నారో నాకు అర్ధం కావడం లేదండీ. నేను చరిత్ర చదవడమే కాదు - పుట్టి పెరిగిందే తెలంగాణాలో. నాకు తెలంగాణా భాష, సంస్కృతి అన్నా, తెలంగాణా ప్రాంత ప్రజలన్న చాలా గౌరవం. నేను, నా తమ్ముళ్ళూ కూడా మాది తెలంగాణా అనే చెప్పుకుంటాము - హైదరాబాదు మా స్వంత ఊరు అని చెప్పుకోడానికి గర్విస్తాము కూడా. కానీ అనవసరంగా, ఇంత దారుణంగా సాటి తెలుగు వారిని గురించి మాట్లాడుతుంటే ఖండించకుండా ఉండలేను. ఒక స్నేహపూరితమైన వాతావరణం ఉంది కనుకే చాలా మంది హైదరాబాదుకి రాగలిగారు, అంతే తప్పిస్తే మీ మీద ఆధిపత్యం చెలాయించలని కానే కాదు. "జై తెలంగాణా" అనకపోతే, హైదరాబాదు నించీ తరిమేస్తామంటూ కొందరు నేతలు మాట్లాడుతుంటే - తెలంగాణా రాకముందే పరిస్థితి ఇలా ఉంది, వస్తె ఇంక ఎంత ఘోరంగా ఉంటుందో అని ఎవ్వరికైనా అనిపించడం సహజం. ఆ బాధ నాకే కాదు చాలా మందికి ఉంది. మీరన్న గతం మీరు కూడా సంపూర్ణంగా చూసి ఉండరు - కానీ అన్యాయం జరిగితే దానికి మూల కారణాన్ని వెతకకుండా - సామాన్య ప్రజలను ఆ ప్రాంతం పేరుతో తూలనాడడం చాలా తప్పు. మీ నాయకులు తెలంగాణా పై ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో, ఎందుకు సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఒక్క సారి అలోచిస్తే మీకే అర్ధం అవుతుంది. మీరన్నట్లు - తెలంగాణేతర తెలుగు వారంతా అమానవీయులై ఉంటే, హైదరాబాదు ఇంత ప్రశాంతంగా, మంచి నగరంగా ఉండేదే కాదు. దయచేసి మీ తోటి వారిని మీతోటి వారుగా చూడడం నేర్చుకోండి. తప్పు చేసిన మీ నాయకులని నిలదీయండి, అంతే కానీ మీలాటి మామూలు ప్రజలను అనవసరపు మాటలు అనకండి.

@ సిరిసిరిమువ్వ గారూ,

మీరు చెప్పేది అక్షరాలా నిజమండీ!

@ చదువరి గారూ,

వాదనలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం. హైదరాబాదులో నేను పుట్టి పెరిగినప్పటినుంచీ చూస్తున్న - గట్టిగా ముస్లిములు మాట్లాడరంటే, ఎంతటి పెద్ద తెలంగాణా వాడైనా, నోరు మెదపడు. అదీ ఇక్కడి హార్మోనీ. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా హైదరాబాదులో గొడవలు జరుగుతూనే ఉండేవి. కర్ఫ్యూల నగరంగానే ఉండేది. యెన్.టీ.ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక - చాలా వరకు ఆ గొడవలు తగ్గాయి. ఆ తరువాత చాలా మంది ఇక్కడ అవకాశాలు ఉన్నాయని వచ్చి స్థిర పడడం వల్ల హిందువుల సంఖ్య బాగా పెరిగాక కాస్త పరిస్థితి మారింది. మీరన్నట్లూఆంద్రోళ్ళ' మీద నిందలు వేసే సగటు తెలంగాణవాది ని నిలదీయాలనే నేను ఈ టపా రాశాను.

@తెలంగానా గారూ -

కాళోజీ చెప్పిన మాటలు సరే - దోపిడీ చెయ్యనొల్లని (సామాన్య ప్రజలని) భీ ఊకెనే అనరాని మాటలు అనొద్దు.

విరజాజి said...

@ కరణ్ గారూ -

మీ నాయకులని అడిగే ధైర్యం లేక మీరు ఇతరుల మీద నిందలు వేస్తున్నారు. కానీ అదే నాయకుల మాటలు నమ్మి తెలంగాణాని "ఆంధ్రోల్లు" దోపిడీ చేసారని అంటున్నారు. వై.ఎస్.ఆర్ రాయలసీమకి నీళ్ళు తరలించడమే కాదు ఇంకా చాలా వెధవ పనులు చేసాడు. తెలంగాణాలో ఒక్కరు కూడా కనీసం అలా ప్రయత్నం అయినా చెయ్యలేదు.

ఎలిమెంటరీ లెక్కలు నేర్చుకోవలసిన అవసరం నాకు లేనే లేదండీ. కొత్త ప్రాజెక్టులు కట్టేటప్పుడు ప్రాంతాల వారీగానే చూస్తారు. మీరన్నట్లు - "రాష్ట్రాలు విభజించినంత మాత్రాన జనాభా గానీ, భూమి గానీ పెరగవు." అప్పుడు తెలంగాణా కన్న, ఆంధ్రా కన్న, కర్ణాటకా, మహారాష్ట్రా పెద్ద రాష్ట్రాలు అయిపోతాయి. అప్పుడు చిన్న రాష్ట్రమైన తెలంగాణాకి నష్టమే కదా

నేను చెప్పేది వితండవాదం అని మీకు అనిపించడంలో నాకు వింతేమీ కనిపించట్లేదు. మీరు సమస్యని వేరే వారిమీదకు నెడుతున్నారు. నేను సమస్య మూలాల్ని వెతకమంటున్నాను.

>> హైదరాబాబుని మేమే డెవలప్ చేసామని చెప్పుకునే ఆంధ్రా నేతలు హైదరాబద్ ని ఏవిధంగా గొడవలు లేవదీసారో చెప్పడమే ఇక్కడ ఉద్దేసం. -- రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. గొడవలు కేవలం ఆంధ్రా నాయకుల వల్ల రాలేదు. అందరూ వారి వారి రాజకీయ ప్రయోజనాలకోసం ఆ పనులు చేసారు. చెన్నారెడ్డి తెలంగాణా పేరు వాడుకొని చివరకు ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ ఊసే ఎత్తలేదు కదా

>> ఆంటే మీ ఉద్దేషం ఏమిటి? తెలంగానా లో అంతా నిరాహార దీక్షలు చేస్తే కాని తెలంగాన రాష్ట్రం రాగూదదా?
మీరు చాలా అపోహ పడుతున్నారు. అందరూ నిరాయా నా ఉద్దేశ్యం అది కానే కాదు. అందరూ కేసీయార్ చేసిన అబధ్ధపు దీక్ష లా చెయ్యరని మాత్రమే చెప్పాను.


>> మరి ఈ తెలంగానా ఇష్యూ కనీసం ఈ మధ్య టీఆరెస్ వచ్చిన తరువాత పదేల్లనుంచైనా ఉంది కదా. అప్పటినుచైనా ఆ పాకేజీ ఏదో ఇస్తే ఇది ఇంత పెద్దగా అయ్యేది కాదు కదా?2004 ఎన్నికల్లో తెలంగానా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ఆ విషయాన్ని తుంగలోకి తొక్కి, ఈ అయిదేల్లలో ఉన్న కొద్ది జలాల్ని కూడా పోలవరం, పోతిరెడ్డిపాడు పేర్లతో ఆంధ్రాకి తరలించడంవల్లే.
మరి ఆ మాట కాంగ్రెస్స్ వారిని ఎందుకు అడగట్లేదు? పాకేజీ ఇవ్వమని గట్టిగా అడిగే నాయకులు లేరు కనుకే ఇలా జరిగింది. అలాటప్పుడు మొన్న 2009 ఎన్నికల్లో అస్సలు తెలంగాణా ఊసే ఎత్తని కాంగ్రెస్స్ ని తెలంగాణా ప్రజలు ఎందుకు గెలిపించారు?


>>అలా అని ఎవరన్న అన్నారా. లేక మీరే కలగన్నారా? తెలంగాణా రాష్ట్రం ఏర్పిడినంత మాత్రాన ఇక్కడి ఆంధ్ర వాల్లను, మార్వాడి, గుజరాతీ వాల్లను మిగతా వాల్లనీ ఎవ్వరూ వెల్లమనలేదు. మీ అనవసర భయాలు మానండి.
ప్రతీరోజూ ఎవరో ఒకరు - ఆంధ్రోల్లు ఇలా , ఆంధ్రోల్లు అలా - వారిని తరిమి తరిమి కొడతాం. ఈ హైదరాబాదు మాది. అంటూ మాట్లాడుతుంటే ఎవ్వరికైనా ఆందోళన కలగడం సహజం.

>>ఈ దేషభద్రతకీ, తెలంగానా రాష్ట్రం వల్ల తేడా ఎలా వచ్చిందో? ఇదేదొ ఐఎస్సై కుట్రలాగా అభివర్నిచడం మీకే చెల్లింది. అవును మరి గూండా రాజకీయాలు తెలియని తెలంగానా వాల్లు సొంత రాష్ట్రంగా ఏర్పదితే రాయలసీమ ఫాక్షనిస్టులనుంచీ, కొస్తాంధ్ర రౌడీ జులుం నుంచీ తమను కాపాడుకోలేరని మీ భయమా? అందుకే కాబోలు అడపా దడపా కోస్తాంధ్ర నుంచి రౌడీలని దించి ఇక్కడి ముఖ్యమంత్రులని దించేస్తారు.
దేస భద్రతకీ, తెలంగాణా కీ చాలా సంబంధం ఉంది. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా వాటి మూలాలు హైదరాబాదుతో ముడిపడి ఉండడం తెలీని విషయం ఏమీ కాదు. రాయలసీమ, కోస్తాంధ్ర రౌడీలు ముఖ్యమంత్రులని దించుతారేమో కానీ - తీవ్రవాదులు, మావోయిష్టులు ఈ దేశానికే ఎసరు పెడతారు.

>> నేను చెప్పేది కూడా అదే. చెన్నారెడ్డి హయాంలో ఆయనను దించడానికి కొందరు బడా సీమాంధ్ర నేతలే గూండాలని దించారు.
ఆ పని ముందు చెన్నారెడ్డి చేయబట్టే తరువాత మరొకరు చేసారు.

>>తెలంగానాకి వచ్చి ఆంధ్రా వాల్లు వాల్లు సొంత లాభం కోసం వ్యాపారాలు చేసుకున్నారు. ఆ వ్యాపారాలు అలాగే ఉంటాయి. తెలంగానా రాష్ట్రం అయినంత మాత్రానా వాల్ల వ్యాపారాలు ఎటూ పోవు. తెలుగు వాల్ల వ్యాపారాలు బెంగులూరు, పూనే, దిల్లీ, అమెరికా లాంటి అనేక చోత్ల ఉన్నాయి. అది మాన్ రాష్ట్రం కానంత మాత్రానా వాల్ల వ్యాపారాలు ఎవరూ లగేసుకోలేదు.

అలాగే మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు తెలుగు వాల్లా వ్యాపారాలు, సినిమా పరిశ్రమఅంతా మద్రాసులో ఉంది. అలాగని చెప్పి మనవాల్లు మద్రాసునుండి విడిపోలేదా?

తెలంగాణా రాష్ట్రం అయిపోతే - వ్యాపారాలు అభివృధ్ధి చెందుతాయో కుంటుపడతాయో మీరు సాటి తెలంగాణా వ్యాపారస్తులనే అడిగి చూడండి. తెలుస్తుంది.

ఇక మద్రాసు విషయానికి వస్తే - అది మన ప్రాంతం కాదనే కదా సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాదుకు తరలి వచ్చేసింది? అప్పుడు మద్రాసుని వదులుకున్నారు - మన రాష్ట్రం కాదు అని. "మనది" అనుకున్నారు కనుక ఇప్పుడు హైదరాబాదు వదలలేకే కదా ఇంత ఆవేదన పడుతున్నారు?

సత్యాన్వేషి said...

విరజాజి గారూ,

కష్టపడ్డా ఎడొ ఒక సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేసినందుకు అబ్దినందనలు.

మద్రసు, పరిశ్రమల విషయం...మీరంటున్నట్లుగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు మనది అనుకుని ఇక్కడికి రాలేదు, ఇక్కడి ప్రభుత్వ రాయితీలవల్ల వచ్చింది. ఇంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం వరకూ కూడా అది చెన్నయి లోనే ఉంది. అలాగే ఐటీ, మిగతా అన్ని పరిశ్రమలూ హైదరాబాదులో ఉన్న అనుకూల పరిస్తితులు, ప్రోత్సాహాలవల్ల వచ్చాయి. ఇవ్వాలు బుజినెస్స్ చేసేవారు ఎవరూ ఇది నా ప్రాంతం అనుకుని చేయరు, ఎక్కడ లాభం ఉంటే అక్కడ చేస్తారు. రాష్టృఆలు కాదు, దేషాలే దాటి లాభాలకోసం వెలుతున్నారు. హైదరాబాదు ఒక్కటే కాదు, విశఖ పట్నం, కాకినాడ లాంటి ఎన్నో ప్రాంతాలు కూడా ఇలా ప్రభుత్వ ప్రొత్సాహకాల వల్ల అభివ్రుద్ధి చెందాయి. ఆ వ్యాపారాలకు తెలంగానా వచ్చినంత మాత్రానా నష్టం లేదు.

మీరు చెబుతున్నది కేవలం రియల్ ఎస్టేట్ బుజినెస్ వెనుకబడుతుందని.. కానీ రియల్ ఎస్టేట్ నిజంగా రియల్ బుజినెస్ కాదు అది బూం మీద అధారపడే బుజినెస్. కాబట్టి మీ అపోహలు మానండి, అపోహలు ప్రచారం చేయకండి.

మిగతా విషయాల గురించి రేపు వ్రాస్తాను.

విరజాజి said...

@ Karan Kumbh

కేవలం ప్రోత్సాహకాలు ఇస్తే పరిశ్రమలు వస్తాయని అనుకుంటే - మరి ఇంతకంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. అప్పుడు హైదరాబాదు నుంచీ వెళ్ళిపోకుండా "బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కాపాడుతూ వచ్చింది. తెలంగాణా అయినట్లైతే - తప్పక ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడకి కొత్త పరిశ్రమలు రానే రావు. ఉన్న వారు కూడా మరో చోటకి తప్పక వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సినిమా వారికి కేవలం ప్రోత్సాహకాలే కాదు - మన ప్రాంతంలో ఉంటే బాగుంటుందని వచ్చినవారు ఎక్కువ. మీరన్న మద్రాసులో తెలుగు పరిశ్రమ ఉన్నన్ని రోజులూ - ఏ నాడూ తెలుగు చిత్ర ప్రముఖుల మీద, షూటింగుల మీద దాడి జరగలేదు. కాబట్టి అస్సలు ప్రభావం ఉండదని మీరు అనుకోకండి. కావాలంటే ఒకసారి పరిశ్రమ వర్గాల్ని కదిపి చూడండి. ఇప్పటికే ఈ బందులు గొడవల వల్ల రాష్ట్రం చాల ఆదాయాన్ని కోల్పోయింది. తెలంగాణా వచ్చినా - అన్ని విధి విధానాల రూప కల్పనకి సమయం పడుతుంది. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో - కొద్ది సమయం చాలు, మనకి వచ్చే అవకాశాలు వేరే వారికి వెళ్ళిపోడానికి. మిమ్మల్ని మీరు ఏమీ కాదని మభ్య పెట్టుకున్నా - నిజాన్ని అంగీకరించక తప్పదు. ఒక ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. ఆ ఇమేజ్ పోగొట్టుకుంటే, మళ్ళీ సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మనం ముందుకు పోయే బదులు వెనక్కి పోతే అది ఎవ్వరికీ మంచిది కాదు. అపోహలు కాదు - చాలా మంది చేప్పే మాట, పరిశ్రమల నుంచీ వచ్చిన మాట నేను చెబుతున్నాను. మీరు కూడా సరిగ్గా విశ్లేషిస్తే మీకూ అర్ధం అవుతుంది.

మీరు నాణానికి ఒకే వైపు అలోచించుతున్నారు - వీలుంటే ఈ క్రింది link కి వెళ్ళండి. కనీసం కాస్త మేధోమధనం అన్నా జరిగే అవకాశం ఉంది.

http://www.tadepally.com/2009/12/blog-post_1657.html

సత్యాన్వేషి said...

>>>>మీ నాయకులని అడిగే ధైర్యం లేక మీరు ఇతరుల మీద నిందలు వేస్తున్నారు. కానీ అదే నాయకుల మాటలు నమ్మి తెలంగాణాని "ఆంధ్రోల్లు" దోపిడీ చేసారని అంటున్నారు. వై.ఎస్.ఆర్ రాయలసీమకి నీళ్ళు తరలించడమే కాదు ఇంకా చాలా వెధవ పనులు చేసాడు. తెలంగాణాలో ఒక్కరు కూడా కనీసం అలా ప్రయత్నం అయినా చెయ్యలేదు.>>>>>

అన్ని వివరనలూ ఇచ్చినా మల్లీ చెప్పిందే చెప్పడం సరైన వాదన కాదు. ఇంతకు ముందే చెప్పాను, మీరన్నట్టు నియోజక వర్గ నాయకులు ప్రాజెక్టులు డిసైడ్ చెయ్యరు, ముఖ్యమంత్రులు చేస్తారు అని, మల్లీ మీ నాయకులని అడగండి అండం ఏమి సబబు? సరే మా నాయకులు వెధవలు. వాల్లు మా అవసరాలకోసం పోరాడరు. కాబట్టి మా వనరులనై అల్లగే దోచుకోవచ్చు, కానీ విడిపోతామని మేము అనవద్దు. ఎందుకీ వింత వాదన?

కనీసం ఇకపై మీ నాయకులని అడగండి లాంటి వాదనలు చెయ్యడం ఆపండి. దీనికి వ్యంగ్య సమాధానం ఇవ్వలంటే ఇలా ఉంటుంది మరి... మా నాయకులని అదిగే ధైర్యం మాకున్నా..మా నాయకులకి సీమాంధ్ర రౌడీ రాజకీయాలు తెలియవు కనుక సీమాంధ్ర నాయకులతో పోరాడే ధమ్ము మా నాయకులకి లేదు. అందుకే విడిపొడామనుకుంటున్నాం.

అసలు ముందు మీ వనరులు ఎవ్వరూ దోచుకోలేదన్నారు. అదెలాగో చూపిస్తే మీ నియొజక వర్గ ఎమ్మెల్యేలను అదగమన్నారు..వాల్లకి ఆ అధికారం లేదని చెబితే మీ నాయకులకి అడిగే ధమ్ము లేదంటారు. ఎందుకీ తల తిక్కా వాదనలు?

తలంగానా వస్తే బాగుంటుందనే ప్రతి వాడూ కేసీయార్ మటలో మరొకడి మాటలో వినే అలా మాట్లాదుతారని మీరనుకోవడం మీ మూర్ఖత్వం. మరి మీరు మీ గోడమీది పిల్లుల్లాంటి చిరంజీవి, జగడపాటి లాంటి వాల్ల మాటలు వినే ఈ బ్లాగులు రాస్తున్నారా? అంతా కేసీయార్ మాటలే విని ఉంటే టీయారెస్ గెలిచి ఉండెది కదా?

సత్యాన్వేషి said...

అసలు మీకు తెలియని విషయం, మీరు నమ్మని విషయం ఏమిటంటే.. తెలంగానాలో చాలా మంది ప్రజలు తెలంగానా రాస్ట్రం వస్తే బాగుంటుందని మనసులో అనుకున్నా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం కేసీఆర్ దీక్ష చేసేప్పుడు కూడా ఎవరూ అంత బలంగా అనుకోలేదు.

కనీ ఎప్పుడైతే చిదంబరం ప్రకటన తరువాత ఒక్కసారి గా ఆంధ్ర నాయకులు అబద్ధపు డ్రామాలూ, ప్లేటు ఫిరాయింపులూ చేసారో, తెలంగానా ఇవ్వొద్దని రాజకీయాలు నడిపారో అప్పటి నుంచే తెలంగానాలొ ప్రజలంతా తెలంగానా కావాలని బలంగ అనుకున్నారు. విల్లా అబద్దపు దీక్షలు నిజంగానే మనలిని వీల్లు దోఛుకుంటున్నారు, అదుకే విడిపోనివ్వడం లేదు అనే అభిప్రాయాన్ని తెలంగానా ప్రజల్లో రేకెత్తించాయి.

ఇంతకూ మీరు మీ నాయకుల మాటలు వినే సమైక్యాంధ్ర కావాలంటున్నారా? మీ నాయకులందరికీ హైదరాబాదులో వాల్లు అక్రమంగా దోచుకున్న భూములమీద ప్రేమతో దీక్షలు చేస్తున్నారు. అందుకే సామాన్యులు ఎవ్వరూ సమైక్యాంధ్ర కావాలని అనట్లేదు.

సత్యాన్వేషి said...
This comment has been removed by the author.
సత్యాన్వేషి said...

>>>>ఎలిమెంటరీ లెక్కలు నేర్చుకోవలసిన అవసరం నాకు లేనే లేదండీ. కొత్త ప్రాజెక్టులు కట్టేటప్పుడు ప్రాంతాల వారీగానే చూస్తారు. మీరన్నట్లు - "రాష్ట్రాలు విభజించినంత మాత్రాన జనాభా గానీ, భూమి గానీ పెరగవు." అప్పుడు తెలంగాణా కన్న, ఆంధ్రా కన్న, కర్ణాటకా, మహారాష్ట్రా పెద్ద రాష్ట్రాలు అయిపోతాయి. అప్పుడు చిన్న రాష్ట్రమైన తెలంగాణాకి నష్టమే కదా>>>>

మల్లీ ఒక్కసారి మీరు ఎలిమెంటరీ లెక్కలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది మీ వాదన చూస్తుంటే. తెలంగానా కన్నా, ఆంధ్రా కన్నా కర్నాటకా మహారాష్ట్రా పెరుగుతాయి.kaanii అప్పుడు మొత్తం నాలుగు రాష్ట్రాలు అవుతాయి, వాటి వాటా ఏమీ మారదు. ఇది ఎలాగో నెను మీకు అర్ధం కావాలంతే ఈ లెక్క చూడండి.

a/(a+b+c+d) = a/(a+b+(c+d)) whether c and d are together or separate.

సత్యాన్వేషి said...

ఇకపోతే తీవ్రవాదం గురించి.. అసలు బీజేపీ లాంటి హిందూ అతివాద పార్టీ కూడా తెలంగానా రాష్ట్రం కావాలంటుంది. తీవ్రవాదులు అంధ్ర ప్రదెష్ అనె పేరు ఉంతే ఉండరూ, తెలంగానా అనే పేరు ఉంటే వస్తారు అనుకోవడం భ్రమ.

ఇంకా కలిసి ఉండడం వల్లనే, వోట్లకోసం కాంగ్రేస్ వాల్ల పాట్లవల్ల పాత బస్తీలో తీవ్రవాదం పెరుగుతోంది అని కూడా చెప్పొచ్చు. రాష్ట్రాల సైజ్ కీ, తీవ్రవాదానికి సంబధం లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఇక్కడి ప్రాత ప్రజల ఆర్ధిక వెనుకబాటుతనం పోగొడితే నక్సలిజం అదే పోతుంది.

సత్యాన్వేషి said...

ఇక్కడ నేనేమీ కేసీఆర్ని గానీ, మరో తెలంగాన నాయకున్ని గానీ సమర్ధించడమ్ళేదు, ప్రస్తుత ఉద్యమ గతినిగనీ, ఆస్తి నష్టాన్ని గానీ, షూటింగులపై దాడిని గానీ సమ్ర్ధించడం లేదు. మనం ఒక ఉద్యమం చెయాలంటే బస్సులు తగలబెట్టాలి, ఆస్తులు నాశనం చెయ్యలి, దాడులు చెయ్యలి అలా చేస్తే కానీ ఇది సాధ్యం కాదు అనే పరిస్తితిని క్రియేట్ చేసాము. పరిటాల రవి, వంగవీటి లాంటి మనుషులు చస్టే వేల బస్సులను తగలబెట్టే మన దేసంలో ఒక రాష్ట్రాన్ని విభజించడానికి చేసే ఉద్యమన్ని శంతియుతంగా చెయ్యడం ఊహించలేము.

కానీ ఇక్కడ నేను చేసే ప్రయత్నం అంతా, రాష్ట్రాన్ని విభజిస్తే కొంపలు అంతుకుపోతాయి, రాష్ట్ర అభివ్రుద్ధి ఆగిపోతుంది, శంతిభద్రతలు కరువవుతున్నాయి, అసలు తెలంగాన వాల్ల వనరులు ఎవరూ దోచుకోలేదు, ఆంధ్రా వాల్లకు రక్షన ఉండదు, మీడియా తెలంగానా పక్షపాతి, కేంద్రం తెలంగానా పక్షపాతి లాంటి అబద్దాలను మాత్రమే ఎండగదుతున్నాను.

మీడియా అంతా ఆంధ్రా వాల్లది, అసలు ప్రజల్లొ ఏమాత్రం బలం లేని సమైక్యాంధ్ర స్పాన్సర్ద్ ఉద్యమాన్ని కూడా రోజంతా చూపిస్తారు.. అయినా మీలాంటి ఆంధ్రా పక్షపాతులు మీడియా తెలంగాన వైపు అంటారు. పోలీసులు ఉస్మానియాలో శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే హాస్టల్లలోకి వెల్లి నలుగురి ప్రానాలు తీస్తారు, ఆంధ్రాలో కోట్లకొద్ది బీఎసెన్నెల్ కేబుల్స్ తగలబదుతున్నా చోద్యం చూస్తారు..కేసీఆర్ దీక్ష చేయడనికి వెల్తుంటే పధకం వేసి దారి కాసి అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడతారు, అదే లగడపాటి సినిమాలోలాగా విజయవాడ నుండి హైదరాబాదు వస్తుంటే చోద్యం చూస్తారు అయినా మీ పక్షపాత మనస్సాక్షి పోలీసులు తెలంగానా వైపు అంటారు.