కొంచెం తెలుగుతనం, కొంచెం సౌకుమార్యం, కొంచెం సాహితీ సుగంధం, కొంచెం కోమలత్వం వెరసి అన్నీ కలిసి నేను.
Monday, 17 May 2010
చిన్నారి శ్రీయుక్త
మా చిన్నారి పాప లలితా శ్రీయుక్త పుట్టటం వల్ల కొద్ది కాలంగా బ్లాగులోకానికి దూరంగా ఉన్నాను. ఈ రోజే మా పాపకి మూడో నెల వచ్చింది. మా పాపని అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ - మీ విరజాజి.
@ రాజ్ గారు, @ సిరిసిరిమువ్వ గారు, @ వైద్య భూషణగారు, @ మధురవాణి గారు, @ పద్మార్పిత గారు - అందరికీ ధన్యవాదాలండీ.
అందరికీ మా పాప పేరు నచ్చినందుకు చాలా సంతోషమండీ !! శ్రీయుక్త పేరు వెనుక ఒక కధ ఉందండోయ్ ! మా అబ్బాయి పేరు అనంత శ్రీహిత్. పాపకి లలిత అని పేరు పెట్టమని వాడు ఒకటే గొడవ... లలిత అనే పేరు వాడికి బాగా నచ్చిందట. నాకూ అమ్మవారి పేరు పెట్టాలని ఉంది ... కానీ మావాడు శ్రీహిత్, శ్రీ తో పాపకి కూడా పేరు పెడితే బాగుంటుందని - కాస్త మెదడుకు పదును పెట్టా... ఏవైనా మంచి రెండు అక్షరాల పేర్లు ఉంటే, దానికి శ్రీ కలిపితే బాగుంటుందని...... శ్రీయుక్త, శ్రీముక్త ...ఈ రెండు పేర్లు తట్టాయి. మా ఇంట్లొ అందరూ శ్రీయుక్త పేరు బాగుంది అన్నారు. అదే పెట్టాము.
మేము వాడని శ్రీముక్త పేరు మీరు ఎవ్వరికైనా సజెస్ట్ చేయవచ్చు - కాపీ రైట్స్ ఏమీ లేవు :-)
ఇంకా శ్రీతో - చాలా పేర్లు ప్రయత్నించవచ్చు - శ్రీకీర్తి, శ్రీకృతి, శ్రీగాత్రి, శ్రీధాత్రి, శ్రీతన్వి, శ్రీమాన్వి, శ్రీచరిత........ ఊరికే ఆలొచిస్తే ఇన్ని పేర్లు వచ్చాయి.
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు, మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
9 comments:
విరజాజి గారు,
మీకు నా శుభాకా౦క్షలు...
చిన్నారి శ్రీయుక్త కి నా ఆశీస్సులు...
మీకు అభినందనలు..మీ చిన్నారి శ్రీయుక్తకు ఆశీర్వాదాలు. లలితా శ్రీయుక్త పేరు బాగుందండి.
nice name. May god bless this kid
మీ వరాల మూట, బంగారు తల్లి 'శ్రీయుక్త' వెయ్యేళ్ళు చల్లగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా!
కంగ్రాట్స్....శ్రీయుక్త పేరు బాగుందండి!
@ రాజ్ గారు, @ సిరిసిరిమువ్వ గారు, @ వైద్య భూషణగారు, @ మధురవాణి గారు, @ పద్మార్పిత గారు - అందరికీ ధన్యవాదాలండీ.
అందరికీ మా పాప పేరు నచ్చినందుకు చాలా సంతోషమండీ !! శ్రీయుక్త పేరు వెనుక ఒక కధ ఉందండోయ్ ! మా అబ్బాయి పేరు అనంత శ్రీహిత్. పాపకి లలిత అని పేరు పెట్టమని వాడు ఒకటే గొడవ... లలిత అనే పేరు వాడికి బాగా నచ్చిందట. నాకూ అమ్మవారి పేరు పెట్టాలని ఉంది ... కానీ మావాడు శ్రీహిత్, శ్రీ తో పాపకి కూడా పేరు పెడితే బాగుంటుందని - కాస్త మెదడుకు పదును పెట్టా... ఏవైనా మంచి రెండు అక్షరాల పేర్లు ఉంటే, దానికి శ్రీ కలిపితే బాగుంటుందని...... శ్రీయుక్త, శ్రీముక్త ...ఈ రెండు పేర్లు తట్టాయి. మా ఇంట్లొ అందరూ శ్రీయుక్త పేరు బాగుంది అన్నారు. అదే పెట్టాము.
మేము వాడని శ్రీముక్త పేరు మీరు ఎవ్వరికైనా సజెస్ట్ చేయవచ్చు - కాపీ రైట్స్ ఏమీ లేవు :-)
ఇంకా శ్రీతో - చాలా పేర్లు ప్రయత్నించవచ్చు - శ్రీకీర్తి, శ్రీకృతి, శ్రీగాత్రి, శ్రీధాత్రి, శ్రీతన్వి, శ్రీమాన్వి, శ్రీచరిత........ ఊరికే ఆలొచిస్తే ఇన్ని పేర్లు వచ్చాయి.
మరో సారి మీ అందరికీ ధన్యవాదాలండీ.
విరజాజి గారు,
మీ చిన్నారికి నా ఆశీస్సులు...
మీకు నా శుభాకా౦క్షలు...
విరజాజి గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
మీ బంగారు తల్లికి నా ఆశీస్సులు కూడా....
Post a Comment