Wednesday, 10 September 2008

అక్షరం

విజ్ఞానపు దీప కాంతి లో నా ఆలోచనల్ని పఠించాలి

వజ్రపు తునకలై తెలివి తేటలను మలచుకోవాలి

బుద్ధి కుశలత్వం రెక్కలై మొగ్గ విచ్చుకోవాలి

చదువులన్నీ కలిసి సమస్యల అంధకారాన్ని పారద్రోలాలి

వికాస వీధుల్లో నడుస్తూ ఈ ప్రపంచాన్నంతా చుట్టి రావాలి

విద్యా గంధం మైపూత పూసుకొని అజ్ఞానపు గ్రీష్మ తాపం జయించాలి

జ్ఞాన వర్షం కురిసి మనసంతా ఇంద్రధనుసై నింగికి ఎగరాలి

అంతులేని అనంత విశ్వం అక్షరమైన అక్షరం తో నిండి పోవాలి

1 comment:

చైతన్య.ఎస్ said...

బాగుంది విరజాజి గారు మీ "అక్షరం".